/rtv/media/media_files/0fdMfOSlVkh9oWPXi5uq.jpg)
Suicide
TG News: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చుంచుపల్లి మండలం రాంనాగర్, సాయిరాం తండాలో గడ్డి మందు తాగి భార్య, భర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. వీరు చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. దంపతుల మృతి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రత్నకుమార్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నాడు.
ఉద్యోగం కోసం డబ్బులు
భార్య పార్వతీ గృహిణి. సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో పరిచమైన ఓ వ్యక్తి కొత్తగూడెంలో సింగరేణి సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ సుమారు రూ.16 లక్షలు తీసుకుని మోసం చేశాడు. ఉద్యోగం పేరుతో మోసపోయామని, అప్పులు పాలయ్యామన్న మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానం వ్యక్తం అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: ఊబకాయంతో కిడ్నీ సమస్యలు తప్పవా..?