TG Crime: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీ ఢీకొని తండ్రీ కొడుకులు మృతి
ఖమ్మం జిల్లా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిల్చున్న బైక్ను లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా దుబ్బతండాకు చెందిన తండ్రీ కొడుకులు అజ్మీరా బాల్యా, సాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందారు.