TRAI : సేవల్లో అంతరాయం కలిగితే కస్టమర్లకు పరిహారం-ట్రాయ్ జిల్లా స్థాయిలో నెట్వర్క్ అంతరాయం కలిగితే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాలని టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ చెప్పింది. టెలికాం కంపెనీలు తప్పనిసరిగా పాటించాల్సిన కొత్త నిబంధనలను ట్రాయ్ విడుదల చేసింది. ఈ నిబంధనలు పాటించని కంపెనీలకు జరిమానా వేయనున్నట్లు తెలిపింది. By Manogna alamuru 04 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి TRAI New Rules : టెలికాం నియంత్రణాధికార సంస్థ ట్రాయ్ (TRAI) కొత్త రూల్స్‌ను ప్రకటించింది. వాటి ప్రకారం నడుచుకోకపోతే ఫైన్ కూడా ఉంటుందని హెచ్చరించింది. జారీ చేసిన కొత్త సేవా నిబంధనలు ప్రకారం, జిల్లా స్థాయిలో నెట్వర్క్ అంతరాయం కలిగితే పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అద్దెపై రిబేటు ఇవ్వాల్సి ఉంటుంది. అదే ప్రీ పెయిడ్ వినియోగదారులకు (Prepaid Customers) అయితే కనెక్షన్ చెల్లుబాటు గడువు పెంచాలి. మరో ఆరు నెలల తర్వాత ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నెట్వర్క్ (Network) అంతరాయం 24 గంటలకు మించితే సర్వీసు ప్రొవైడర్లు అద్దెలో కొంత భాగాన్ని రిబేటుగా ఇవ్వాల్సి ఉంటుంది. పోస్ట్ పెయిడ్ వినియోగదార్లకు (Postpaid Customers) వచ్చే బిల్ సైకిల్లో వాటిని చూపించాలి. 12 గంటలకు పైగా అంతరాయం ఉన్నా అద్దెలో రిబేటు లేదా వ్యాలిడిటీ కొనసాగింపునకు దానికి ఒక రోజుగానే పరిగణించాల్సి ఉంటుంది. వారం రోజుల్లోగా నెట్వర్క్ ఇష్యూ లేకుండా చేయాలి. ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో మాత్రమే, ఈ ప్రయోజనాలను అందించాల్సిన అవసరం ఉండదు. నాణ్యతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే కంపెనీలకు కనీస అపరాధ రుసుమును రూ.50,000 నుంచి రూ.1లక్షకు పెంచింది ట్రాయ్. నిబంధనల ఉల్లంఘనల గ్రేడ్లను బట్టి రూ.1 లక్ష, రూ.2 లక్షలు, రూ.5 లక్షలు, రూ.10 లక్షల మేర జరిమానాను విధిస్తుంది. ప్రైమరీ, సెల్యులార్ మొబైల్ సర్వీసెస్, బ్రాడ్ బ్యాండ్ సేవలు, బ్రాడ్ బ్యాండ్ వైర్లెస్ సేవలకు ట్రాయ్ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఫిక్స్డ్ లైన్ సర్వీసు ప్రొవైడర్లు అయినా పోస్ట్ పెయిడ్, ప్రీ పెయిడ్ కస్టమర్లకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. తమ నెట్‌వర్క్‌లోని వైఫల్యానికి మూడు రోజుల్లోగా పరిష్కారం చూపాల్సిందే. చెల్లింపు చేసిన 7 రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లు 98 శాతం కనెక్షన్లను యాక్టివేట్ చేయాలి. టెల్కోలు తమ వెబ్సైట్లలో సర్వీసు ప్రకారం (2జీ, 3జీ, 4జీ, 5జీ) జియో స్పేషియల్ కవరేజీ మ్యాప్‌లను వినియోగదారుల సౌకర్యం కోసం ఇవ్వాల్సి ఉంటుంది. Also Read: China: చైనాలో వరదలు..గ్రీన్ హౌస్ వాయువులే కారణం #telecom-companies #new-rules #trai #fine మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి