Missing: ఇసుక కోసం వెళ్లారు... ఇంతలోనే విషాదం

సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి నలుగు వ్యక్తులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.

New Update
Eleru river

Eleru river

 AP News: అల్లూరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో విషాద ఘటన చోటు చేసుకుంది. అడ్డతీగల మండలం తిమ్మాపురంలో ఇసుక కోసం ఏలేరు వాగులోకి దిగి నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. సొంత ఇంటి నిర్మాణం కోసం ట్రాక్టర్‌పై ఏలేరు వాగు నుంచి ఇసుక తెచ్చుకునేందుకు వెళ్లి ఊబిలో కూరుకుపోయి గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరొకరు వాగులోకి దిగి మృత్యువాత పడ్డారు. గల్లంతయిన నలుగురు ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

20 DSPs transferred in AP.pdf

కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా:

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, SDRF బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. గోంతయ్య, జయబాబు మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన భూషణం, శ్రీను కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, బావమరిదిగా గుర్తించారు. మరో యువకుడు ఇంటి పక్కన ఉండే శ్రీనుగా పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. 

ఇది కూడా చదవండి:  ఈ దేశంలో సమోసాలపై నిషేధం..తింటే శిక్ష తప్పదు

ఘటన స్థలానికి చేరుకున్న రంపచోడవరం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు మిర్యాల శిరీష దేవీ, వరుపుల సత్య ప్రభ మృతుల కుటుంబాలను ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యేలు హామీ ఇచ్చారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉచిత ఇసుక కోసం ఇలా ప్రమాదం ఉన్న చోటకు వెళ్లొద్దని, ఇలాంటి ప్రాంతాలను గుర్తించి ఖచ్చితంగా నిషేధిత ప్రాంతాలుగా పరిగణలోకి తీసుకుంటామని ఎమ్మెల్యే మిర్యాల శిరీష అన్నారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్ష ఫీజుల షెడ్యూల్ విడుదల!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు