T-Congress Politics : వీహెచ్ కు టీపీసీసీ షాక్.. అలా చేస్తే వేటే అంటూ వార్నింగ్!
పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే వారికి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ షాకిచ్చారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల వీహెచ్ సీఎం రేవంత్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.