Rashmika Mandanna: నటి రష్మికకు గాయాలు .! ఏం జరిగిందంటే
టాలీవుడ్ నటి రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయమైనట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
టాలీవుడ్ నటి రష్మిక మందన్న గాయపడినట్లు తెలుస్తోంది. వ్యాయామం చేస్తుండగా ఆమెకు గాయమైనట్లు సమాచారం. దీంతో ఆమె అభిమానులు రష్మిక త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యాన్స్ ని ఆకట్టులేకపోయినట్లు తెలుస్తోంది. కథ.. కథనం అన్నీ ఔట్ డేటెడ్.. ఓవరాల్ గా గేమ్ చేంజర్ ఒక ప్రెడిక్టబుల్ పొలిటికల్ డ్రామా అని అంటున్నారు నెటిజన్లు.
గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. Sacnilkనివేదిక ప్రకారం తెలుగు వెర్షన్ కి సంబంధించి దాదాపు రూ. 2.6 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయి. ఓవర్సీస్లోనూ అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
జర్నలిస్ట్ పై దాడి కేసులో నటుడు మోహన్ బాబుకు స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. నాలుగు వారాలకు కేసు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణ వరకు మోహన్ బాబు పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.
అనంతపురంలో ఈరోజు జరగనున్న బాలయ్య డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యింది. తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో చిత్ర యూనిట్, నందమూరి బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
సూర్య- పూజ హెగ్డే కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెట్రో. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. 2025 మే 1న థియేటర్స్ లో విడుదల కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. కార్తీక్ సుబ్బరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కమెడియన్ వైవా హర్ష ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. అందులో తన 91 ఏళ్ల అంకుల్ తప్పిపోయారని, ఆయన్ను వెతికేందుకు సహాయం చేయాలని కోరాడు. ఆయన చివరగా ఉన్న లొకేషన్ కు సంబంధించి ఫుటేజ్ ను పంచుకున్నాడు. ఆయన కనిపిస్తే కాల్ చేయమని నంబర్స్ కూడా ఇచ్చాడు.
మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ గతం గతః..నిన్న జరిగింది మర్చిపోయి, రేపు చేయాల్సిన మంచి గురించి ఆలోచించాలి అని అన్నారు. దీంతో ఇకపై మోహన్ బాబు, మనోజ్ ఎప్పటి లాగే కలిసే ఉండబోతున్నారని టాక్.