సంధ్య థియేటర్ ఘటన.. బాధిత కుటుంబానికి మైత్రీ మూవీస్ భారీ సాయం
సంధ్య థియేటర్ ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబానికి 'పుష్ప2' నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ ఆర్థికసాయం అందించారు. ఈ మేరకు నిర్మాత నవీన్ సోమవారం శ్రీ తేజ్ కుటుంబాన్ని పరామర్శించి, మృతురాలి కుటుంబానికి రూ.50లక్షల చెక్కును అందజేశారు.