Tirupati: చిల్లరతో లక్షల బండి... నువ్వు మాములోడివి కాదు బాసూ..!
స్కూటీ కొనేందుకు వెళ్లిన ఓ అర్చకుడు షోరూం యాజమాన్యానికి షాక్ ఇచ్చాడు. అక్షరాల లక్ష ముప్పై వేల చిల్లర నాణెలు సంచుల్లో తీసుకెళ్లిన మురళీధర ఆచార్యులు వాళ్ల ముందు రాశులుగా పోశాడు. ఒక్కసారిగా కంగుతిన్న ఎంప్లాయిస్ చివరికి ఓపికగా లెక్కించి.. కేక్ కట్ చేయించి మరీ బండి చేతికిచ్చారు.