AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. భార్య ధనలక్ష్మి తన ప్రియుడి హరితో కలిసి భర్త నరేష్‌ను చంపేసింది. అర్థరాత్రి దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి, తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ప్రియుడి కోసం గాలిస్తున్నారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Tirupati: ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు ఎక్కువ అయ్యాయి. అందుకోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు. తాజాగా, తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. పాడిపేటలో ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది భార్య. అర్థరాత్రి దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి, తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించింది. ముసిలిపేడుకు చెందిన భార్యాభర్తలు నరేష్, ధనలక్ష్మి.. 10 రోజుల క్రితం పాడిపేటకు మకాం మార్చారు.

అయితే, భార్య ధనలక్ష్మి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న భర్త నరేష్..ప్రియుడు హరితో గొడవపడ్డాడు. దీంతో  భార్య ధనలక్ష్మి తన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రియుడుతో కలిసి స్కెచ్ వేసింది. అర్థరాత్రి నిద్రపోతున్న భర్త నరేష్ ను దిండుతో చంపి అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరివేశారు.. అదే సమయంలో భార్య ధనలక్ష్మి తన ఇద్దరి పిల్లలు గట్టిగా అరవకుండా వారి నోర్లు మూసివేసింది. ఎట్టకేలకు కూతురు నిధి శ్రీ స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ప్రియుడు హరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also read: పోలీసుల దౌర్జన్యం.. యువకుడు బలి..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు