Meerpet Boy Missing Incident : రంగారెడ్డి జిల్లాలో బాలుడి మిస్సింగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. జిల్లెలగూడకు చెందిన టిల్లు అనే బాలుడు ఈ నెల 4న మధ్యాహ్నం ట్యూషన్కెళ్లి కనిపించకుండా పోయాడు. బాలుడి మిస్సింగ్‌పై ఆందోళన చెందిన తల్లిదండ్రులు మీర్పేట్ ఠాణాలో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. స్థానిక సీసీ ఫుటేజ్ పరిశీలించగా.. గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని బైక్‌పై తీసుకెళ్లిన దృశ్యాలు కనిపించాయి.
పూర్తిగా చదవండి..Also Read: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందువుల ఇళ్లపై దాడి, మహిళలపై అత్యాచారం!
ఎట్టకేలకు సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా మిస్సయిన బాలుడి ఆచూకీ లభ్యం అయింది. హైదరాబాద్‌లో మిస్సయిన బాలుడు తిరుపతిలో ప్రత్యక్ష్యం అయ్యాడు. హైదరాబాద్ నుంచి తిరుపతి ట్రైన్ ఎక్కి వెళ్లాడు ఆ బాలుడు. ఈ విషయంపై ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు సమాచారం ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే, గత అర్ధరాత్రి తిరుపతి రైల్వేస్టేషన్లో బాలుడు ఒంటరిగా కూర్చొని కనిపించాడు. విచారించిన పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో ఉన్నాడు. బాలుడి ఆచూకిపై మీర్‌పేట పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు తల్లిదండ్రులతో కలిసి మీర్‌పేట పోలీసులు తిరుపతి బయలుదేరారు.
[vuukle]