Chinta Mohan : కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి చిరంజీవినే : చింతమోహన్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చిరంజీవినే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, చిరంజీవినే కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి అని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
తిరుమలలో డ్రోన్ కెమెరా తిరగడం కలకలం రేపింది. మోకళ్ల పర్వతంపై అస్సాంకు చెందిన కొందరు ఈ డ్రోన్ విజువల్స్ తీశారు. నడకమార్గం, ఘాట్ రోడ్డు అలాగే తిరుమల కొండను షూట్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి తిరుమలలో డ్రోన్స్ ఎగరవేయడం నిషేధం.
రానున్న ఏపీ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో ఉన్న పవన్ కల్యాణ్ గతంలో పోటీ చేసిన భీమవరంతో పాటు తిరుపతి నుంచి కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజుల క్రితం తిరుపతి జనసేన నేతలతో ఆయన సమావేశం అయ్యారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో ధనుర్మాసంలో ప్రత్యేక పూజా నివేదనలు నిర్వహిస్తారు ఆలయ అర్చకులు. నిత్యం స్వామివారిని మేల్కొల్పే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు.
తిరుమల పుణ్యక్షేత్రంలో గత వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. తిరుమలలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి .రోజంతా వర్షం కురుస్తుండడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ తో కోయంబత్తూరు- చెన్నై మధ్యలో రెండు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. న్యూఢిల్లీ నుంచి హైదరాబాదు మీదుగా తిరుపతి జిల్లా రేణిగుంటకు వచ్చే ఎయిర్ ఇండియా విమానంతోపాటు పలు రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు.
విశాఖ నుంచి సికింద్రాబాద్ , తిరుపతి, బెంగళూరులకు వెళ్లే వారాంతపు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే నిర్ణయించింది. ఈ ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 4 నుంచి నడపనున్నట్లు రైల్వే అధికారులు వివరించారు.
చంద్రగిరి నియోజకవర్గంలో 35వేల దొంగ ఓట్లను తాము గుర్తించామని ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాని సంచలన వ్యాఖ్యలు. మృతి చెందిన 5వేల మంది ఓటర్లను తొలగించకపోగా అదనంగా అడ్రస్ ట్రేస్ చేయలేని 20వేల వరకు దొంగ ఓట్లను కలిపారని మండిపడ్డారు.