/rtv/media/media_files/x5ZyZInvHTBHMgw76MN7.jpg)
YS Jagan:తిరుపతి, తిరుమలలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జగన్ పర్యటన నేపథ్యంలో తిరుమలలో ఆంక్షలు పెట్టారు పోలీసులు. అర్ధరాత్రి నుంచి తనిఖీలు చేస్తున్న పోలీసులు.. జగన్ రాకతో సీమ జిల్లాల నుంచి వైసీపీ శ్రేణులు తిరుపతికి రానున్నారు. వైసీపీ నేతలను వెళ్లకుండా కట్టడికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కడప సరిహద్దులో భారీగా తనిఖీలు చేపట్టారు పోలీసులు.
పోలీస్ యాక్ట్ 30..
తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30 విధించినట్లు ఆ జిల్లా ఎస్పీ తెలిపారు. నిరసనలు, ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనసరి అని పేర్కొన్నారు.ఇప్పటికే లడ్డూ వివాదంపై పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. కూటమి ఆరోపణలకు కౌంటర్‌గా జగన్ తిరుమల టూర్ చేపట్టారు. ముందు జాగ్రత్తగా ఆంక్షలను అమల్లోకి తెచ్చింది ప్రభుత్వం. ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్ చేరుకోనున్నారు. రేపు శ్రీ వారిని దర్శించుకునేలా ప్రణాళిక రూపొందించారు.
Follow Us