AP News : గుడిసె పర్యాటకంలో విషాదం
అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం గుడిసె పర్యాటకంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు ఆకుమామిడి కోట సమీపంలోని పర్యాటక ప్రాంతానికి వచ్చిన అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు.