AP News : గుడిసె పర్యాటకంలో విషాదం

అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం గుడిసె పర్యాటకంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు  ఆకుమామిడి కోట సమీపంలోని పర్యాటక ప్రాంతానికి వచ్చిన అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన  యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు.

New Update
AP Tourism

AP Tourism

AP News : అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం గుడిసె పర్యాటకంలో విషాదం నెలకొంది. స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు  ఆకుమామిడి కోట సమీపంలోని పర్యాటక ప్రాంతానికి వచ్చిన అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి చెందిన  యువకుడు వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు.ఎన్టీఆర్ జిల్లా అమరావతి ఎస్ ఆర్ ఎమ్ యూనివర్సిటీలో  సెకండ్ ఇయర్ చదువుతున్న ఎనిమిది మంది విద్యార్థులు పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన గుడిసెలో గడిపేందుకు వచ్చారు. పర్యాటక శాఖ అక్కడ ఏర్పాటు చేసిన గుడిసెల్లో సేద తీరుతూ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు.

కాగా లకృత్యాలు తీర్చుకునేందుకు ఆకుమామిడి కోట సమీపంలోని వాగు వద్దకు వెళ్లిన నాగులపాటి మల్లేశ్వరరావు (19) అనే యువకుడు ప్రమాదవశాత్తు ఆకుమామిడి కోట సమీపంలోని వాగులో మునిగిపోయి మృతి చెందాడు. కళ్ళ ముందే స్నేహితుడు మునిగిపోతుంటే ఏం చేయలేక అక్కడే ఉన్న స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా హాస్పిటల్ తరలించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు