Thatikonda Rajaiah : కడియం.. నీకు సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయ్!

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. సిగ్గు శరం ఉంటే.. నీలో వరంగల్ పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

New Update
kadiyam

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే రాజయ్య సంచలన కామెంట్స్ చేశారు. సిగ్గు శరం ఉంటే.. నీలో వరంగల్ పౌరుషం ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏ పార్టీలో ఉన్నావో చెప్పుకోడానికి కూడా కడియంకు సిగ్గులేదన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రాజీనామా చేయమని అని తిడుతున్న కూడా కడియంకు సిగ్గు వస్తలేదని మండిపడ్డారు. కుక్కకు ఉన్న విశ్వాసం కూడా నీకు లేదని రాజయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.  నీకు సిగ్గు, శరం, చీము, నెత్తురు ఉంటే... మగాడివి అయితే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని రాజయ్య సవాల్ విసిరారు. తన కూతురు కోసం పార్టీ ఫిరాయించి రెండు వందల కోట్లకు ఎమ్మెల్యే అమ్ముడు పోయాడని రాజయ్య ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ కడియం శ్రీహరిపై స్పీకర్ వెంటనే అనర్హత వేటు చేయాలని పేర్కొన్నారు. ఈనెల30లోపు నిర్ణయం తీసుకోకుంటే కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాజయ్య చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. 

మూడు నెలల్లోగా నిర్ణయం

మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వ్యవహారంపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్‌కు ఆదేశించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ కార్యాలయం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో ఆదేశించారు. స్పీకర్ నోటీసులకు పార్టీ మారిన కొంతమంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని, కేవలం తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించామని పేర్కొన్నారు. తాము ఇంకా బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నామని చెబుతున్నారు.   ఈ ఎమ్మెల్యేల వాదనను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్లు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని, సమావేశాల్లో కూడా పాల్గొన్నారని బీఆర్‌ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌లో చేరకపోతే అసెంబ్లీలో ప్రతిపక్షానికి బదులుగా అధికార పక్ష బెంచ్‌లలో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నిస్తున్నారు.  సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనివల్ల రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు