New year Changes 2025: నేటి నుంచి మారనున్న కొత్త రూల్స్ ఇవే!
నేటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కార్ల ధరలు పెరుగుదల, అమెజాన్ ప్రైమ్ యూజర్ల డివైజ్ కనెక్ట్‌ను తగ్గించడం, యూపీఐ లిమిట్, గ్యాస్ ధరల్లో మార్పులు వస్తాయి.
నేటి నుంచి కొన్ని కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. కార్ల ధరలు పెరుగుదల, అమెజాన్ ప్రైమ్ యూజర్ల డివైజ్ కనెక్ట్‌ను తగ్గించడం, యూపీఐ లిమిట్, గ్యాస్ ధరల్లో మార్పులు వస్తాయి.
న్యూ ఇయర్ విషెష్ అంటూ కొత్త ట్రిక్‌తో సైబర్ నేరగాళ్లు దాడి చేస్తున్నారు. విషెష్ అంటూ ఏవైనా లింక్స్ వస్తే ఓపెన్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. పొరపాటున లింక్ ఓపెన్ చేస్తే ఇక మీ పర్సనల్ డేటా, బ్యాంక్ వివరాలు వారి చేతుల్లోకి వెళ్లిపోాతాయని చెబుతున్నారు.
జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 9 రైళ్లకు యాడ్ చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు జనరల్ కోచ్‌లు ఉండగా.. మరో రెండు కోచ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది.
దేశంలో ఈ ఏడాది కొత్త మోడళ్లతో ఎన్నో కార్లు మార్కెట్లోకి వచ్చాయి. కానీ ఇందులో కొన్ని కంపెనీ కార్లు మాత్రమే బాగా అమ్ముడయ్యాయి. ఇందులో మారుతి సుజుకి ఆల్టో టాప్ ప్లేస్‌లో ఉంది. బెస్ట్ ఫీచర్లు ఉండటంతో ఎక్కువ శాతం మంది ఈ కార్లు కొనుగోలు చేశారు.
మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఈ క్రమంలో కొందరు ఇంటిని రంగువల్లికలతో అలంకరిస్తారు. చుక్కలు, గీతలు, డిజైన్ వంటి ముగ్గులతో అందంగా తయారు చేస్తారు. కేవలం రంగులతో మాత్రమే కాకుండా పువ్వులతో ఇలా ఒకసారి ముగ్గులు వేసి ట్రై చేయండి.
తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. బూరుగుపూడి గేట్ దగ్గర ఉన్న అద్భుత రెసిడెన్సీలో రేవ్ పార్టీ జరుగుతుందని పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని 5 గురు యువతులు, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ దేవాదాయ శాఖ ఈవోలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ నెయ్యిని యాదగిరిగుట్టతో పాటు రాష్ట్రంలోని ఆలయాలు వాడాలని ఈవోలను ఆదేశించింది. ఇప్పటి వరకు చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసి జనవరి 1వ తేదీ నుంచి ఉపయోగించాలని తెలిపింది.
అమెరికా మాజీ ప్రెసిడెంట్ జిమ్మీ కార్డర్ తుది శ్వాస విడిచారు. యునైటెడ్ స్టేట్స్‌కి 39వ ప్రెసిడెంట్‌గా సేవలు అందించిన జిమ్మీ గత రెండు నెలల క్రితమే వందేళ్లు పూర్తి చేసుకున్నారు. డెమోక్రాటిక్ పార్టీ సభ్యుడు అయిన జిమ్మీ నోబెల్ శాంతి బహుమతి కూడా పొందారు.
దక్షిణ కొరియా విమానం ప్రమాదానికి కొన్ని గంటల ముందు మరో రెండు వేర్వేరు చోట్ల ఫ్లైట్లు అదుపు తప్పాయి. కెనడాలోని హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టుతో పాటు నార్వేలోని టోర్ప్ ఎయిర్‌పోర్టులో విమానాలు అదుపు తప్పాయి. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదాలు తప్పాయి.