రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. సామాన్య ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు రెండు జనరల్ బోగీలు ఉండగా.. వీటికి అదనంగా మరో రెండు జనరల్ బోగీలను యాడ్ చేయనుంది. ఇలా జనరల్ బోగీలను యాడ్ చేయడం వల్ల సామాన్య ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మొత్తం 31 రైళ్లకు ఇప్పటికే రెండు విడతల్లో జనరల్ బోగీల సంఖ్య పెంచారు. మరో 9 రైళ్లకు జనరల్ బోగీల సంఖ్యను పెంచనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఇది కూడా చూడండి: Musk: కొత్త సంవత్సర వేళ..పేరు మార్చుకున్న మస్క్..ఎంత వింతగా ఉందో చూడండి!
జనవరి 1 నుంచి అమలు
ఇదిలా ఉండగా.. 2025 జనవరి 1 నుంచి కొన్ని మార్పులు అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన రిలీజ్ చేసింది. అందులో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సమయాల్లో మార్పులు జరిగాయి. ఇది విజయవాడ నుంచి వైజాగ్ వరకు ప్రయాణిస్తుంది. విజయవాడ నుంచి వైజాగ్ వెళ్లే ప్రయాణికులతో ఈ ట్రైన్ ఎప్పుడూ కిటకిటలాడుతుంది.
ఇది కూడా చూడండి: Kadapa: న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం
ఇప్పుడు ఈ ట్రైన్ సమయాల్లో మార్పులు చేశారు. ఇది వరకు ఈ ట్రైన్ విజయవాడ స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు ప్రారంభం అయ్యేది. కానీ ఇప్పుడు షెడ్యూల్ మారింది. ఇక నుంచి 15 నిమిషాల ముందుగానే ఈ ట్రైన్ బయల్దేరుతుంది. అంటే కొత్త టైం ప్రకారం.. ఉదయం 6 గంటలకే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుంచి స్టార్ట్ అవుతుంది.
ఇది కూడా చూడండి: Horoscope 2025: కొత్త ఏడాదిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. ఆ రాశుల లిస్ట్ ఇదే!
దీంతోపాటు MMTS రైళ్ల సమయాల్లో సైతం మార్పులు జరిగాయి. జనవరి 1 నుంచి ఈ ట్రైన్ ప్రయాణ సమయాల్లో దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా, ప్రయాణికుల సౌకర్యార్థం ఈ మార్పులు చేసింది. ఈ మార్పులను NTES (నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్)లో చూసుకోవచ్చు.
ఇది కూడా చూడండి: AP: మద్యం దుకాణదారులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుడ్ న్యూస్