HCUలో హైటెన్షన్.. స్టూడెంట్స్ Vs పోలీస్.. కేటీఆర్, హరీష్ అరెస్ట్!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. భూముల అమ్మకాన్ని నిలిపివేయాలంటూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు మెయిన్‌ గేట్‌ మూసివేశారు. కేటీఆర్, హరీష్, మహేశ్వరరెడ్డి తదిరత నేతలను యూనివర్సిటీకి వెళ్లకుండా అరెస్ట్ చేశారు.

New Update

హైదరాబాద్‌ సెంట్రల్ వర్సిటీలో హైటెన్షన్ నెలకొంది. వర్సిటీ మెయిన్ గేట్‌ ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో HCU మెయిన్‌ గేట్‌ ను పోలీసులు మూసివేశారు. విద్యార్థులు లోపలికి వెళ్లకుండా అడ్డుగా బారికేడ్స్ ఏర్పాటు చేశారు. భూముల అమ్మకం ఆపాలని.. చెట్ల తొలగింపు ప్రక్రియ నిలిపివేయాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. HCU విద్యార్థుల నిరసనలకు బీఆర్ఎస్, బీజేపీ తదితర ప్రతిపక్ష పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. వర్సిటీకి వెళ్లకుండా బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి:HCU భూముల అమ్మకంపై యూనివర్సిటీ కీలక ప్రకటన

నేతల హౌస్ అరెస్ట్ లు..

కేటీఆర్, హరీష్ రావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. HCU సందర్శనకు బయల్దేరిన బీజేపీ నేతలను సైతం అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర బీజేపీ నేతలను పోలీసులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ నేతల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. 
ఇది కూడా చదవండి:TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
(hcu campus land issue | telugu-news | telugu breaking news)

Advertisment
తాజా కథనాలు