పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్టరీ ఇంకా వీడలేదు. నిన్న బయటకు వచ్చిన సీసీ కెమెరా విజువల్స్ ప్రకారం పాస్టర్ మద్యం మత్తులోనే యాక్సిడెంట్ కు గురయ్యారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే.. ప్రవీణ్ అభిమానులు, క్రిస్టియన్ సంఘాల నేతలు మాత్రం దీనిని అంగీకరించడం లేదు. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇది ముమ్మాటికీ హత్యేనని మరో సంచలన వీడియో విడుదల చేశారు. ప్రవీణ్ ను చంపి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో టీ తాగిన హోటల్ లో పని చేసే వ్యక్తి RTVకి పలు కీలక విషయాలు వెల్లడించారు.
ప్రయాణం వద్దని చెప్పా..
తమ హోటల్ ఎదురుగా బుల్లెట్ బండి ఆపారన్నారు. ఎస్ఐ తమ హోటల్ వద్దకు ప్రవీణ్ ను తీసుకువచ్చాడన్నారు. ముందు తనను నీళ్లు అడిగారన్నారు. మాస్క్ తీసి నీళ్లు తాగారన్నారు. కొంచెం తాగి వెంటనే పక్కకు పెట్టాడన్నారు. పాస్టర్ చాలా నీరసంగా కనిపించారన్నారు. బండి బాగాలేదని.. ఈ సమయంలో ప్రయాణం చేయొద్దని చెప్పామన్నారు. ఊడిపోయిన హెడ్ లైట్ కట్టడానికి దారం తీసుకురమ్మంటే.. తీసుకువెళ్లానన్నారు. తాను వెళ్లేలోగా ప్రవీణ్ వెళ్లిపోయారన్నారు.
(telugu-news | latest-telugu-news | telugu breaking news)