సిగ్గు.. సిగ్గు.. తెలుగు అకాడమి పుస్తకాలపై నిరుద్యోగులు ఫైర్! తెలుగు అకాడమి పుస్తకాలపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవి పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో 'సిగ్గు, సిగ్గు.. వాటిని ఎవరు కొనొద్దు. చదవొద్దు. టీజీపీఎస్సీ మోసం' అంటూ పోస్టర్లు అంటించారు. By srinivas 04 Oct 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి Telugu Academy : తెలుగు అకాడమి తయారు చేస్తున్న పుస్తకాల కంటెంట్ వివాదాస్పదమైంది. పోటీ పరీక్షలకు ప్రామాణికం కాదని తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఎవరు కొనవద్దని, చదవకూడదంటూ విజ్ఞప్తి చేస్తూ హైదరాబాద్ కేంద్రంగా నిరుద్యోగులు పోస్టర్లు అంటించారు. తప్పు అంటే తప్పు ఒప్పు అంటే ఒప్పు.. 'సిగ్గు సిగ్గు.. నిరుద్యోగుల జీవితాల్లో తెలుగు అకాడమీ నిప్పులు పోస్తోంది. 150లో 14 ప్రశ్నలు తప్పులుంటే 450, 600 ప్రశ్నల్లో ఇంకెన్నీ దారుణాలో. గ్రూప్-1లో 150 ప్రశ్నలను కూడా తయారుచేయలేని టీజీపీఎస్సీ. తెలుగు అకాడమి తప్పులు నిరుద్యోగుల జీవితాల్లో నిప్పులు. టీజీపీఎస్సీ అను నేను ఒక నియంతని. నేను తప్పు అంటే తప్పు ఒప్పు అంటే ఒప్పు. నిరుద్యోగులకు గమనిక టీజీపీఎస్సీ నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు ప్రామాణిక కానీ తెలుగు అకాడమి పుస్తకాలు కొనకండి.. చదవకండి. తెలుగు అకాడమి నిరుద్యోగులను మోసం చేస్తోంది. అంటూ పోస్టర్ల ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. విద్యావంతులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. Also Read : ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే? రీసెర్చ్ చేయకుండా రాశారు.. తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాల కంటెంట్ నాణ్యతగా లేదని, అన్నీ తప్పులేనంటూ టీజీపీఎస్సీ హైకోర్టులో ఆఫిడవిట్ సమర్పించింది. ఈ పుస్తకాలు పోటీపరీక్షలకు పనికిరావని, వీటిని ప్రామాణికంగా తీసుకోలేమని తెలిపింది. అకాడమీ ముద్రించిన పుస్తకాలు రన్నింగ్ నోట్స్‌లా ఉన్నాయి. ఎలాంటి రీసెర్చ్ చేయకుండా రాశారు. ఇవి కేవలం గైడ్‌లా మాత్రమే ఉపయోగపడతాయంటూ కోర్టుకు తెలిపింది. గ్రూప్-1 ప్రిలి మ్స్ ఫైనల్ ‘కీ’లోని నాలుగు ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఐదుగురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. 68,79, 106, 112 ప్రశ్నల సమాధానాలపై వారు అ భ్యంతరాలు వ్యక్తంచేశారు. గ్రూప్-1 ఫైనల్ ‘కీ’లో మార్పులు.. ఒక ప్రభుత్వ రంగ సంస్థ ముద్రించిన పుస్తకాలను ఒక చట్టబద్ధమైన సంస్థ అంగీకరించబోమని చెప్పడంతో నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణ హిస్టరీ-కల్చర్ 2016, తెలంగాణ రీజినల్ జాగ్రఫీ, పుస్తకాలను రెఫరెన్స్‌గా పేర్కొన్నారు. వీటి ఆధారంగా గ్రూప్-1 ఫైనల్ ‘కీ’లో మార్పు లు చేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. తెలంగాణ హిస్టరీ-కల్చర్ 2016 పుస్తకంలో 33 చా ప్టర్లతో.. పూర్వ చారిత్రక కాలం నుంచి ఆధునిక కాలం వరకు అనేక వాస్తవాలను స్ఫురించారు. 16 మంది అకాడమిషన్లు రూపొందించగా, ముగ్గురు సీనియర్ అకాడమిషన్లు ఎడిట్‌చేశారు. ఏ పాఠాన్ని ఏ అకాడమిషన్ రచించారో వ్యక్తపరచలేదంటూ టీజీపీఎస్సీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. పరిశోధన ఆధారంగా లేవు..ఈ పుస్తకాలేవి పరిశోధన ఆధారంగా లేవని, మొత్తం పుస్తకాల పేజీల్లోనూ అధికారమైన మూలాలను ఉదహరించలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫుట్‌నోట్స్ లేవు. పుస్తకంలో ముద్రించిన అంశాలు పరిశోధన ఆధారంగా లేవు. పాఠ్యాంశాల్లో ప్రస్తావించిన అంశాలకు రెఫరెన్స్ లేదు. ప్రామాణిక మూలాలేంటో తెలీదు. అన్నీ రన్నింగ్ నోట్స్ లా ఉన్నాయి. వివిధ మూలాల నుంచి సేకరించిన అంశాలను, విషయాలను సంకలనం చేసి వివిధ అధ్యాయాలుగా విభజించారు. డిగ్రీ, పీజీ ఏ కోర్సుల్లోనూ పాఠ్యపుస్తకాలుగా సూచించలేదని టీజీపీఎస్సీ కోర్టుకు వివరించింది. #tgpsc #books #telugu-academy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి