Telangana: గర్భిణికి ఆర్టీసీ మహిళా సిబ్బంది కాన్పు.. స్పందించిన సీఎం రేవంత్
కరీంనగర్ బస్స్టేషన్లో టీజీఆర్టీసీ మహిళా సిబ్బంది ఓ గర్భిణికి కాన్పు చేయండంపై సీఎం రేవంత్ స్పందించారు. కాన్పు చేసి తల్లిబిడ్డను కాపాడిన ఆర్టీసీ మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో ఇలాగే మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్థున్నట్లు పేర్కొన్నారు.