ఎమ్మెల్యే కేటీఆర్‌కు లీగల్ నోటీసులు

TG: కేటీఆర్‌కు సృజన్‌రెడ్డి లీగల్‌ నోటీసులు పంపారు. తెలంగాణ సర్కారు తన కంపెనీ శోభ కన్‌స్ట్రక్షన్‌కు ఇచ్చిన అమృత్‌ టెండర్లలో అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలపై ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

New Update
MLA KTR

MLA KTR: బీఆర్‌ఎస్‌ మాజీ మంత్రి కేటీఆర్‌కు సృజన్‌ రెడ్డి షాక్ ఇచ్చారు. ఆయనకు లీగల్‌ నోటీసులు పంపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన కంపెనీ శోభ కన్‌స్ట్రక్షన్‌కు ఇచ్చిన అమృత్‌ టెండర్లలో అవినీతి జరిగిందంటూ చేసిన ఆరోపణలపై నోటీసులు అందించారు. బీఆర్‌ఎస్‌ నేతలు, కేటీఆర్‌ తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి అధరాలు లేవని అన్నారు. 

తాను కష్టపడి సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠలను దెబ్బతీసే ఉద్దేశంతోనే ఇవన్నీ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పత్రికలు, సోషల్‌ మీడియాలో తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై  సోషల్‌ మీడియా, వెబ్‌సైట్లలో వచ్చిన వార్తలను తొలిగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తన పరువుకు నష్టం కలిగించే ప్రకటనలను వెనక్కి తీసుకొని, 24 గంటల్లోగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్‌ను డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. కాగా సృజన్ రెడ్డి ఇచ్చిన నోటీసులపై కేటీఆర్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది.

2010 నుంచి పని చేస్తోంది..

తన  కంపెనీ శోభ కన్‌స్ట్రక్షన్స్‌ 2010 నుంచి పని చేస్తోందని సృజన్ రెడ్డి చెప్పారు. శోభ కన్‌స్ట్రక్షన్స్‌ 2020 నుంచి AIR, IHPలతో కలిపి జాయింట్‌ వెంచర్‌గా పని చేస్తోందని అన్నారు. అమృత్‌ టెండర్లలో భాగంగా రూ.1100 కోట్లపనుల టెండర్లు దక్కించుకుందని తెలిపారు. ఇందులో శోభ కన్‌స్ట్రక్షన్స్ వాల్యూ 29 శాతం మాత్రమే, కేవలం రూ.321 కోట్లు అని క్లారిటీ  ఇచ్చారు.

Advertisment