గో బ్యాక్ హైడ్రా.. పాతబస్తీలో హైటెన్షన్

TG: పాతబస్తీలో హైడ్రాకు నిరసన సెగ తగిలింది. కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. గో బ్యాక్ హైడ్రా అంటూ నినాదాలు చేపట్టారు. అధికారులతో స్థానికులు వాగ్వాదానికి దిగగా.. అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
HYDRA OLDCITY

Hydra: పాతబస్తీలో హైటెన్షన్ వాతావరణమే నెలకొంది. హైడ్రా అధికారులకు నిరసన సెగలు తగిలాయి. పాతబస్తీలో కూల్చివేతలపై హైడ్రాకు వ్యతిరేకంగా జనం రోడెక్కారు. హైడ్రా అధికారులు వస్తున్నారనే సమాచారంతో ఉదయమే ఇళ్లలో నుంచి బయటకు వచ్చి ఆందోళన చేపట్టారు. కిషన్‌బాగ్,మహమ్మద్‌ నగర్‌లో ఆందోళనలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తమ ఇళ్లను కూల్చితే ఊరుకునేది లేదని హైడ్రా అధికారులు వార్నింగ్‌ ఇస్తున్నారు.

సర్వేను అడ్డుకున్నారు..

నిన్నటి నుంచి మూసీపరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు. అధికారుల సర్వేను స్థానికులు అడ్డుకున్నారు.  కొత్తపేట, మారుతినగర్‌, సత్యానగర్ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులను అడ్డుకుని సర్వే పత్రాలు లాక్కొని చించేశారు నిర్వాసితులు. గోడలను మార్క్‌ చేయకుండా అడ్డుకున్నారు. అధికారులు, నిర్వాసితులకు మధ్య వాగ్వాదంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన ఎక్కువ కావడంతో సర్వే నిర్వహించకుండానే వెనుదిరిగారు అధికారులు. ఇళ్లు ఖాళీ చేసే ప్రసక్తే లేదని స్థానికులు స్పష్టం చేశారు.

Advertisment
తాజా కథనాలు