Maha Kumbh Mela 2025 : మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం..కాలి బూడిదైన గుడారాలు...
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. మహాకుంభమేళాలోని సెక్టార్ 18, 19ల మధ్య ఉన్న అనేక శిబిరాల్లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. అనేక గుడారాలు మంటల్లో చిక్కుకున్నాయి.పలు గుడారాలు కాలి బూడిదయ్యాయి.