Telangana IAS Transfers: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు
తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
మరికొన్ని నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ తెలంగాణలో అధికారులు బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా 95 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. SR నగర్ ఏసీపీ బదిలీ.. కొత్త ఏసీపీగా పి.వెంకట రమణను నియమించింది.
గృహజ్యోతి పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధనను ఖరారు చేసింది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కరెంటు బిల్లు బకాయిలు ఉండకూడదు. ఒక రేషన్ కార్డుపై ఒక సర్వీసు. ఒకటికి మించి విద్యుత్తు మీటర్లు ఉండకూడదు. అద్దెకుంటున్న వారికి రేషన్ కార్డు తప్పనిసరి చేయనుంది.
రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. రూ.2లక్షల రుణమాఫీపై కసరత్తు చేస్తోంది. రూ.28వేల కోట్ల మేర రుణాలను ఒకే దఫాలో రుణమాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఈ క్రమంలో రుణమాఫీ కోసం కొత్త కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయనుంది.
ప్రజా పాలన దరఖాస్తులు రోడ్లపై కనిపించిన దృశ్యాలు ఈ రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. దీంతో సీరియస్ అయిన రేవంత్ రెడ్డి సర్కార్ హయత్‌నగర్ వాల్యూయేషన్ అధికారి మహేందర్ పై సస్పెన్షన్ వేటు వేసింది.
తెలంగాణలో ఆరు గ్యారెంటీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని నియమించింది రేవంత్ సర్కార్.
ఏపీలో మాదిరిగా తెలంగాణలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మోడల్ ను ప్రభుత్వం అధ్యాయనం చేస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో కొత్త హైకోర్టు భవన నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ 100 ఎకరాల భూమి కేటాయించింది. రాజేంద్ర నగర్ బుద్వేల్, ప్రేమావటిపేటలో స్థలం కేటాయిస్తూ జీవో 55 విడుదల చేసింది.
విద్యాశాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ అధికారులు, మంత్రులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రిజర్వేషన్స్ అమలుపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం కొత్త చట్టం అమలుకు సిద్ధం అన్నారు.