Musi River : మూసీలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ సర్కార్‌ యాక్షన్‌

TG: మూసీలో అక్రమ నిర్మాణాలపై రాష్ట్ర సర్కార్‌ యాక్షన్‌ మొదలు పెట్టింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. రివర్‌బెడ్‌లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్‌ టీమ్స్‌‌ను ఏర్పాటు చేసింది.

New Update
MUSI

Hydra on Musi: మూసీలో అక్రమ నిర్మాణాలపై తెలంగాణ సర్కార్‌ యాక్షన్‌ మొదలు పెట్టింది. కబ్జాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపట్టింది. రివర్‌బెడ్‌లోని ఇండ్ల సర్వేకు 25 స్పెషల్‌ టీమ్స్‌ ను ఏర్పాటు చేసింది. ఒక్కో టీమ్‌లో తహసీల్దార్‌తో పాటు ఐదుగురు ఆఫీసర్స్‌లను పెట్టింది. రివర్‌బెడ్ లో 2166 ఇండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రివర్‌బెడ్‌లోని వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వనుంది రేవంత్ సర్కార్.

333 నిర్మాణాలను..

ఆ దిశగా అర్హులను గుర్తించేందుకు అధికారుల సర్వే చేపట్టారు. రాజేంద్రనగర్ మండలంలో అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్‌ సర్వే చేశారు. 333 నిర్మాణాలను అధికారులు గుర్తించారు. చైతన్యపురి డివిజిన్‌ సత్యనగర్, మారుతీనగర్‌లో అధికారుల సర్వే చేస్తుండగా.. రెవెన్యూ అధికారులను  కాలనీవాసులు అడ్డుకున్నారు. దీంతో సర్వే చేయకుండానే అధికారులు వెనుదిరిగారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

Also Read :  వంగవీటి రాధాకు గుండెపోటు!

Advertisment
Advertisment
తాజా కథనాలు