ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం, కేబినేట్లో కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.ఇకపై ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా కొనసాగనున్నారు.దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది.ఈ నిర్ణయంతో 43,373 మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. దీనికి సంబంధించి విధివిధానాలు, నిబంధనలు రూపొందించేందుకు అధికారులతో సబ్‌కమిటీ ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.