సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. ఆ మూడు ప్రాజెక్టులపై విచారణ
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి ప్రాజెక్ట్, భద్రాద్రి ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై జ్యూడీషియల్ విచారణ చేస్తామని అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాదాద్రి ప్రాజెక్ట్, భద్రాద్రి ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై జ్యూడీషియల్ విచారణ చేస్తామని అన్నారు.
తాను తెలంగాణ బీజేపీ ఛీఫ్ కిషన్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేశాననే దానిపై వివరణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా తమ ప్రభుత్వం ప్రతిపక్ష గొంతులు నొక్కదాని.. తమది ప్రజాపాలన అంటూ హరీష్ రావుపై చురకలు అంటించారు.
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రవేశపెట్టిన శ్వేతపత్రంపై స్పందించారు హరీష్ రావు. కరోనా, కేంద్రం నిధులు ఇవ్వకపోవడం వల్లే తెలంగాణలో అప్పులు పెరిగిపోయాయి అని అన్నారు. కేంద్రం నిధులు ఇచ్చి ఉంటే లక్ష కోట్ల అప్పు తగ్గేదని ఆయన అన్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో పెట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మొత్తం బడ్జెట్ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే అని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కన్న కలలన్నీ కలలుగానే మిగిలిపోయాయని పేర్కొన్నారు. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు జరిగిన చర్చ హాట్ హాట్‌గా సాగింది. సభలో విద్యుత్, సాగునీరు, వ్యవసాయం, డ్రగ్స్ అంశంపై కీలక చర్చ జరిగింది.
తెలంగాణ అసెంబ్లీలో చర్చలు హాట్ హాట్‌గా జరిగాయి. సభలో సీఎం రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్‌గా సాగింది. ముఖ్యంగా డ్రగ్స్ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా ఉంటామని, ఎంతటి వారినైనా బొక్కలో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
పోటీ పరీక్షల్లో ఉర్దూ భాషను పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ. కాంగ్రెస్ కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే.. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఏమీ చేయలేదనట్లుగా మాట్లాడటం సరికాదన్నారు.