Kapil Sibal : సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా కపిల్ సిబల్!
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో తన ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్‌పై గెలుపొందారు. ఎస్సీబీఏ అధ్యక్ష పదవికి సిబల్ ఎన్నిక కావడం ఇది నాలుగోసారి.