Note For Vote Case : నేడు సుప్రీం కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

ఓటుకు నోటు కేసుపై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేసేలా ఆర్డర్ ఇవ్వాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.

author-image
By V.J Reddy
New Update
Note For Vote Case: రేపు సుప్రీంలో 'ఓటుకు నోటు' కేసు విచారణ

Note For Vote Case: 2015లో కొత్తగా ఏర్పాటు అయిన తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఓటుకు నోటు కేసుపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నేతలు. ఈ కేసుపై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్ ల ధర్మాసనం విచారణ జరపనుంది.

Also Read :  కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌ న్యూస్‌...!

ఈ కేసు ఏంటి?

2015లో తెలంగాణ (Telangana) లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యేను ప్రలోభ పెట్టేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ప్రయత్నించారని తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో చర్చలు జరిపిన వీడియోను సైతం ఏసీబీ విడుదల చేయడంతో అది సంచలనంగా మారింది. ఆ కేసులో రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లారు.

ఈ సందర్భంగా చంద్రబాబు స్టీఫెన్ సన్ తో జరిపిన ఫోన్ సంభాషణలు కూడా బయటకు రావడంతో కేసు మరింత సంచలనంగా మారింది. నాటి సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఏపీలో దోచుకున్న డబ్బుతో చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనాలని ప్రయత్నించారని వైసీపీ నేతలు ఆరోపించారు. 

Also Read :  హెజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

గతంలో సీఎం రేవంత్ కు నోటీసులు...

ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల సమయంలో  ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసు విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు మార్చాలని సుప్రీంకోర్టులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీష్‌ రెడ్డి ట్రాన్స్‌ఫర్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను భోపాల్‌కు బదిలీ చేయాలన్న వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి, ఇతర ప్రతివాదులకు గతంలో సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఈరోజు దీనిపై మరోసారి విచారణ చేపట్టనుంది.

Also Read :  మా డబ్బులతో జగన్.. పవన్ తో భేటీ తర్వాత బాలినేని సంచలనం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు