Road accident : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
రోడ్డుప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. రాంనగర్‌లోని అడిక్‌మెట్ బ్రిడ్జిపై ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పడంతో కిందపడి ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
టెన్త్ పేపర్ లీక్? | Telangana SSC Exam 2025 Paper Leak Latest Updates | 10th TS Students | RTV
AP Crime: కర్నూల్లో కీచక టీచర్.. బాలికలకు బ్లూ ఫిల్మ్ చూపించి ఏం చేశాడంటే!
ఏపీలో మరో కీచక టీచర్ నిర్వాకం బయటపడింది. నంద్యాల ఏనుగుమర్రి పాఠశాల సోషల్ టీచర్ బొజ్జన్న విద్యార్థినిలకు నీలి చిత్రాలు చూపించి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అతన్ని విధుల నుంచి శాశ్వతంగా తొలగించాలని పిల్లల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు.
Viral Video: డిగ్రీ విద్యార్థినులతో ప్రిన్సిపల్ హోళీ.. ఎత్తుకుని అసభ్యంగా తాకుతూ దారుణం: వీడియో
హోళీ సందర్భంగా ఏపీలో ఓ ప్రిన్సిపల్ విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించాడు. కదిరి అమృతవల్లి డిగ్రీ కాలేజీ అమ్మాయిలను ఎత్తుకుని బురదలో పడేశాడు వెంకటపతి. కొందరిని బ్యాడ్ టచ్ చేశాడు. వీడియో వైరల్ అవుతుండగా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.
Half day school : రేపటి నుంచే ఒంటిపూట బడులు..టైం ఏంటంటే.
తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం ఆరుగంటల నుంచే ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలకు ఒంటిపూట బడులు ప్రకటించారు.
విద్యార్థుల మధ్య ఫేర్వెల్ పార్టీ చిచ్చు.. ఒకరు మృతి
కేరళలోని కోజికోడ్‌లో ఓ స్కూల్లో ఫేర్వెల్ పార్టీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెండు గ్రూపుల విద్యార్థులు మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో ఓ పదవ తరగతి విద్యార్థి ఇతర విద్యార్థులపై దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
TS: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఇక్కడి సీట్లు ఇక్కడివారికే
తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు స్థానికులకే 100 శాతం ఇస్తామని తెలిపింది. దీనిపై కొత్త జీవోను విడుదల చేసింది.
POCSO case : సిద్ధిపేటలో ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి విద్యార్థినీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నది. తాజాగా సిద్దిపేట జిల్లా ఖమ్మంపల్లిలో మరో ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అతనిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.