Murder : లోకల్ ట్రైన్ లో మర్డర్.. మద్యం మత్తులో ప్రయాణికుడిని చంపిన యువకులు.. వీడియో వైరల్!
ముంబై లోకల్ ట్రైన్ లో ఘోర మర్డర్ జరిగింది. వివాహవిందుకు వెళ్లి వస్తున్న యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి ప్రయాణికుడిపై కత్తి, బెల్టుతో దాడిచేశారు. షాహాపూర్ కు చెందిన దత్తాత్రయ్ భోయిర్ అనే రైతు చికిత్స పొందుతూ మృతిచెందాడు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.