నువ్వు మహిళవేనా...రోజా | RK Roja Reaction On Konda Surekha Comments | Samantha | Nagarjuna | RTV
కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్..
మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ కేటీఆర్ లీగల్ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే తన పేరును వాడుకుంటున్నారని మండిపడ్డారు. కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని లేదంటే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసు పెడతామని హెచ్చరించారు.
కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన సమంత.. ఏమన్నారంటే ?
కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందించింది. విడాకులు నా వ్యక్తిగత విషయమని.. ఇద్దరి అంగీకారంతోనే విడాకులు తీసుకున్నామని పేర్కొంది. ఇందులో రాజకీయ నేతల ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించింది.
గేమ్ ఛేంజర్' సాంగ్.. చరణ్ డ్యాన్స్ పై సమంత కామెంట్ వైరల్
'గేమ్ ఛేంజర్' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 'రా.. మచ్చ మచ్చ' అంటూ సాగిన పాటలో రామ్ చరణ్ తన ఎనర్జిటిక్ స్టెప్పులతో దుమ్ములేపారు. ఈ సాంగ్ లో చరణ్ డ్యాన్స్ పై సమంత స్పందిస్తూ..'డ్యాన్స్ లో నిన్నెవరూ మ్యాచ్ చేయలేరు’ అని పేర్కొన్నారు.
Casting couch: సమంతకు మద్దతుగా అనుష్క శెట్టి.. టాలీవుడ్లోకి హేమ కమిటీ ఎంట్రీ!?
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ హేమ లాంటి కమిషన్ ఏర్పాటు చేయాలనే సమంత డిమాండ్‌కు అనుష్కశెట్టి మద్దతు పలికింది. లైంగిక వేధింపులు అరికట్టేందుకు హేమ కమిటీని టాలీవుడ్ లోకి స్వాగతిస్తున్నామంటూ నెట్టింట పోస్ట్ పెట్టింది. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని కోరింది.
Samantha : టాలీవుడ్‌లోనూ మహిళలకు వేధింపులు.. సమంత సెన్షేషనల్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులపై సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లోనూ మహిళలకు వేధింపులు జరిగాయన్నారు. 2019లో ఏర్పాటైన సబ్ కమిటీ రిపోర్టు ఏదని ప్రశ్నించారు. ఆ కమిటీ రిపోర్టును బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Movies: పికిల్ బాల్ లీగ్ ఫ్రాంఛైజీ యజమానిగా సమంత
సమంత ఈరోజు ఒక స్పెషల్ విషయాన్ని చెబుతానని ప్రకటించింది. అందరూ కచ్చితంగా ఆమె పెళ్ళి వార్తే అయి ఉంటుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ సమంత మాత్రం వరల్డ్ పికిల్ బాల్ ఫ్రాంచేజీకి యజమానిగా ఉంటున్నా అంటూ ఫోటో షేర్ చేసింది.
Samantha: ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటన.. సమంత కీలక వ్యాఖ్యలు
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యచార ఘటనపై సినీ నటి సమంత స్పందించారు. ఇది కేవలం డాక్టర్ల భద్రత సమస్య మాత్రమే కాదని.. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళ్లకూడదని అనుకునే మహిళలందరి సమస్యగా అభిప్రాయపడ్డారు. మహిళకు గౌరవంగా బ్రతికే హక్కుందని పేర్కొన్నారు.