నాగార్జున ఫ్యామిలీని రోడ్డుపైకి లాగడానికి కారణం అదే.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
మంత్రి సురేఖ నటి సమంత పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై RGV ఆగ్రహం వ్యక్తం చేశారు. "కొండా సురేఖ తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం సహించబడుదు అని ట్వీట్ చేశారు."
RGV Reacts On Konda Surekha : నటి సమంత, నాగ చైతన్య విడాకుల పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనం రేపుతున్నాయి. బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అక్కినేని నాగార్జున, సమంత, నాగచైతన్య పేర్లను ప్రస్తావిస్తూ.. కేటీఆర్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కినేని కుటుంబం, సమంతతో సహా పలువురు సినీ ప్రముఖులు సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎదుటివారి వ్యక్తిగత సంబంధంలేని వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఏ మాత్రం సరికాదని మండిపడ్డారు.
RGV ట్వీట్
తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యల పై సంచలన డైరెక్టర్ RGV స్పందించారు. అక్కినేని కుటుంబం పై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "కొండా సురేఖ నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానిస్తూ చేసిన కామెంట్లకి నేను షాకయ్యాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం సహించబడదు" అని ట్వీట్ చేశారు.
KTR ని దూషించే క్రమంలో అక్కినేని కుటుంబాన్ని అంత దారుణంగా అవమానించటంలో అర్ధమేంటో కనీసం ఆవిడకైనా అర్ధమయ్యుంటుందో లేదో నాకర్ధమవ్వటంలేదు ?
తనని రఘునందన్ ఇష్యూ లో ఎవరో అవమానించారనీ అసలు ఆ ఇష్యూతో ఏ మాత్రం సంబంధం లేని నాగార్జున, నాగ చైతన్యలని అంతకన్నా దారుణంగా అవమానించటమేంటి? https://t.co/AA29iDzlQ6
ఇది ఇలా ఉంటే మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యల పై క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. "నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ, సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల కారణంగా మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.
నాగార్జున ఫ్యామిలీని రోడ్డుపైకి లాగడానికి కారణం అదే.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!
మంత్రి సురేఖ నటి సమంత పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై RGV ఆగ్రహం వ్యక్తం చేశారు. "కొండా సురేఖ తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం సహించబడుదు అని ట్వీట్ చేశారు."
rgv
RGV Reacts On Konda Surekha : నటి సమంత, నాగ చైతన్య విడాకుల పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నెట్టింట సంచలనం రేపుతున్నాయి. బుధవారం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో అక్కినేని నాగార్జున, సమంత, నాగచైతన్య పేర్లను ప్రస్తావిస్తూ.. కేటీఆర్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు తీసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కినేని కుటుంబం, సమంతతో సహా పలువురు సినీ ప్రముఖులు సురేఖ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎదుటివారి వ్యక్తిగత సంబంధంలేని వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం ఏ మాత్రం సరికాదని మండిపడ్డారు.
RGV ట్వీట్
తాజాగా కొండా సురేఖ వ్యాఖ్యల పై సంచలన డైరెక్టర్ RGV స్పందించారు. అక్కినేని కుటుంబం పై ఆమె చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "కొండా సురేఖ నాగార్జున కుటుంబాన్ని అత్యంత దారుణంగా అవమానిస్తూ చేసిన కామెంట్లకి నేను షాకయ్యాను. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ నాగార్జున ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగడం ఏ మాత్రం సహించబడదు" అని ట్వీట్ చేశారు.
ఇది ఇలా ఉంటే మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యల పై క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశారు. "నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ, సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా..నా వ్యాఖ్యల కారణంగా మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.
Also Read: రైతులకు కేంద్రం 'దసరా' కానుక - 'పీఎం కిసాన్ నిధులు' విడుదల ఎప్పుడంటే!