/rtv/media/media_files/ZYH5elGUK4DMPZWnns9c.jpg)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బుధవారం కేటీఆర్ పై విమర్శలు చేస్తూ టాలీవుడ్ కి చెందిన నాగచైతన్య, సమంతలని ఉద్దేశించి పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలు కాస్త ఇటు రాజకీయ వర్గాల్లో, అటు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇప్పటికే ఆమె చేసిన వ్యాఖ్యలపై సినీ స్టార్స్ ఒక్కొక్కరుగా స్పందిస్తూ కొండా సురేఖపై దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇదే వివాదంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ ఆడియో క్లిప్ రిలీజ్ చేశారు. అందులో ఆయన కొండా సురేఖ.. సమంతను అవమానించలేదు, పొగిడారని అన్నాడు." కొండా సురేఖ.. సమంతకు క్షమాపణ చెప్పడం నాకు నచ్చలేదు. అసలు సమంతను ఆమె ఎక్కడ అవమానించలేదు, పొగిడారు.
కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? RGV మరో సంచలన ఆడియో..@iamkondasurekha #RGV #sensational #Audio #Samantha #kondasurekhaneedtoApologize #Nagarjuna pic.twitter.com/JqXc7grHcB
— RTV (@RTVnewsnetwork) October 3, 2024
సమంతను పొగిడింది..
ఆమె చెప్పిందేంటి.. నాగార్జున, నాగ చైతన్య ఇద్దరూ కలిసి ఒక మామగా, ఒక భర్తగా ..కోడల్ని తనకున్న ఆస్తిని కాపాడుకోవడానికి వెళ్ళమని బలవంతం చేస్తే, ఆమె కాదని చెప్పి విడాకులిచ్చి వెళ్ళిపోయింది. అక్కడ సమంతకు అవమానం ఏంటి? ఆమెను పొగిడినట్లు కదా! అవమానించింది నాగార్జున, నాగ చైతన్యలను. అసలు దాని గురించి ఎవరూ మాట్లాడటం లేదు.
కొండా సురేఖ సమంతకి క్షమాపణ చెప్పటమెంటి??? అక్కడ అత్యంత జుగుప్సాకరంగా అవమానించింది నాగార్జునని, నాగ చైతన్యని.. ఒక మామగారు, ఒక భర్త, ఒక కోడలిని , ఒక భార్యను, వాళ్లకి సంబంధించిన ఒక ఆస్తిని కాపాడుకోవడానికి ఫోర్స్‌తో పంపించడానికి ట్రై చేస్తే, తను విడాకులు ఇచ్చి వెళ్ళిపోయిందని చెప్పటం…
— Ram Gopal Varma (@RGVzoomin) October 3, 2024
అక్కినేని ఫ్యామిలీ కి ఉన్న హుందాతనం, ఇండస్ట్రీలో వాళ్లకున్న పేరు ప్రఖ్యాతలు పక్కనపెడితే.. ఏ ఇంట్లో అయినా ఒక మామ, భర్తపై ఇలాంటి ఆరోపణ నా జీవితంలో లేదు. ఇలాంటివి మళ్ళీ జరగగకుండా దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. ఇండస్ట్రీ కోసం, ప్రజలందరి కోసం సీరియస్ గా తీసుకోని మర్చిపోలేని గుణపాఠం చెప్పాలని కోరుతున్నా" అని అన్నారు.
Also Read : తొక్క తీస్తాం..కొండాసురేఖ ఎపిసోడ్‌లో టాలీవుడ్ పెద్దల రియాక్షన్ ఇదే!