నేను ఏ హీరోయిన్ నూ బెదిరించలేదు.. కేటీఆర్ సంచలన వీడియో! కేటీఆర్ చాలామంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడంటూ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమైన విషయం తెలిసిందే. అయితే.. కేటీఆర్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను ఏ హీరోయిన్ నూ బెదిరించలేదని, ఏ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని అన్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. By Anil Kumar 03 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను విమర్శిస్తూ సినీ పరిశ్రమ నటులను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సమంత, నాగచైతన్య కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని ఆయన మినిస్టర్ గా ఉన్న టైంలో అనేక మంది హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి కొందరు హీరోయిన్స్ ను బ్లాక్ మెయిల్ చేశాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇది కాస్త అటు రాజకీయ వర్గాల్లో, సినీ వర్గాల్లో పెద్ద వివాదంగా మారింది. అయితే దీనిపై కేటీఆర్ కూడా స్పందిస్తూ.. కొండా సురేఖ మాటలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లీగల్ నోటీసును పంపించారు. కేవలం రాజకీయ కక్షతోనే, రాజకీయాల ప్రయోజనం కోసమే తన పేరును వాడుకుంటున్నారని అన్నారు. Also Read : 'దేవర' హిట్టు బొమ్మ.. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్, తారక్ చెప్పిందే నిజమైంది ఒక మహిళ అయి ఉండి ఇంకో మహిళ పేరును, సినిమా పేరును వాడుకొన వారి వ్యక్తిత్వ హనానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో కేటీఆర్ కు ఇదే ప్రశ్న ఎదురయ్యింది. మీకు హీరోయిన్స్ తో లింక్ ఉందని, ఫోన్ ట్యాపింగ్ కూడా నిజమేనని వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు కరెక్ట్ అని ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి అడిగితే అందుకు కేటీఆర్ బదులిస్తూ.. నన్ను అరెస్ట్ చేయండి.. నిజంగా నేనేమన్నా తప్పు చేసి ఉంటే అది ప్రూవ్ చేసి నన్ను అరెస్ట్ చేయండి. నేను ఎవరితో నైనా తప్పు చేసిఉంటే, ఎవర్నైనా వేధించి ఉంటే, ఫోన్ ట్యాపింగ్ చేసుంటే.. నేను ఎలాంటి చర్యలకైనా సిద్దమే. లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేసినా, నార్కో అనాలసిస్ టెస్ట్ చేసినా నాకు ఓకే.. నేనుఏ హీరోయిన్ ను బెదిరించలేదు, ఏ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు.. " అని అన్నారు.. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. Allegations paina KTR epudo cheppindu!! pic.twitter.com/7WzVqEJgjY — 𝓐𝓫𝓱𝓲𝓼𝓱𝓮𝓴 (@redzredzlol) October 2, 2024 #ktr #konda-surekha #samantha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి