Harish Rao: రైతు బంధు ఎప్పుడు వేస్తారు?.. హరీష్ రావు ఫైర్!
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వం వైపు చూస్తుందని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. రైతు బంధు పెంచుతాం అన్నారు.. పెంచిన రైతు బంధు ఎప్పుడు నుంచి ఇస్తారు అని రాష్ట్ర సర్కార్ ను ప్రశ్నించారు.
టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్. రైతు బంధు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి రేవంత్ లేఖ రాశారని ఆరోపించారు. రేవంత్ కాదు.. రేటెంత రెడ్డి అని సెటైర్లు వేశారు.
కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం వల్లే ఈసీ రైతు బంధు నిధులు ఆపేసిందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. బీఆర్ఎస్ గెలిస్తే.. తొలి మంత్రివర్గ సమావేశంలో అసైన్డ్ భూములకు పట్టాలపై సంతకం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్.
రైతు బంధు నిధుల విడుదల ఆపేయాలని ఈసీ బీఆర్ఎస్ పార్టీకి ఆదేశాలు ఇవ్వడంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వల్లే నిధులు ఆగాయని అన్నారు. రాబందులను తరిమికొట్టండి అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
‘రైతుబంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుబంధు చెల్లింపులకు మళ్లీ అనుమతించాలని ఈసీని బీఆర్ఎస్ కోరింది.
రైతుబంధును కాంగ్రెస్ అడ్డుకుందనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి స్పందించారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. పది రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు భరోసాగా రూ.15 వేలు ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చారు.
రైతు బంధు పంపిణీని ఆపాలని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీఐకి ఫిర్యాదు చేశారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. డిసెంబర్ 3 తర్వాత మళ్లీ కేసీఆరే అధికారంలోకి వస్తారని.. అప్పుడు రైతుల ఖాతాల్లో యథావిథిగా రైతుబంధు డబ్బులు జమ అవుతాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతలే ఎలక్షన్ కమిషన్ వెంటపడి మరీ రైతు బంధును ఆపివేయించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని.. అన్నదాత నోటికాడికి వచ్చిన ముద్దను లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.
తెలంగాణలో ఎన్నికల సంఘం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా దీన్ని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో రైతుబంధు పంపిణీ పర్మిషన్ను వెనక్కి తీసుకుంది.