తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం రైతు బంధు పంపిణీకి ఇచ్చిన పర్మిషన్ను వెనక్కితీసుకున్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ వెంటపడి మరీ కాంగ్రెస్ నేతలు రైతు బంధును ఆపివేయించారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని.. అన్నదాత నోటికాడి ముద్దను లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు. ఉపాధి హామీ నిధులకు కేంద్ర ప్రభుత్వం భారీగా కోతలు విధించిందని.. ఈ పథకంలో కూలీలకు సగటున రూ.150 కూడా రావడం లేదని కవిత ఆరోపించారు. వేలాది మంది కూలీల పొట్టగొడుతున్న బీజేపీని కాంగ్రెస్ ఎందుకు ప్రశ్నించడం లేదంటూ ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..Rythu Bandhu: కాంగ్రెస్ నేతలే వెంటపడి రైతుబంధు ఆపివేయించారు: కవిత
కాంగ్రెస్ నేతలే ఎలక్షన్ కమిషన్ వెంటపడి మరీ రైతు బంధును ఆపివేయించారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మరోసారి రైతు వ్యతిరేక పార్టీ అని నిరూపించుకుందని.. అన్నదాత నోటికాడికి వచ్చిన ముద్దను లాగేసుకున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు.
Translate this News: