Rythu Bandhu Scheme: తెలంగాణలో ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఈనెల 28లోపు రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చిన ఈసీఐ.. తాజాగా దీన్ని వెనక్కి తీసుకొంది. ఎన్నికల కోడ్ నియమాలను ఉల్లంఘించారనే నేపథ్యంలో ఉపసంహరించుకున్నట్లు ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి నిధులు విడుదల చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల మంత్రి హరీష్రావు.. నవంబర్ 28న రైతు బంధు (Rythu Bandhu) డబ్బులు జమ చేస్తామని ప్రకటించడంతో దీన్ని పరిగణలోకి తీసుకున్న ఈసీఐ (ECI).. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ పర్మిషన్ను రద్దు చేసింది.
పూర్తిగా చదవండి..Telangana: బీఆర్ఎస్కు బిగ్ షాక్.. రైతుబంధు పంపిణీకి బ్రేక్..
తెలంగాణలో ఎన్నికల సంఘం సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇటీవలే రైతుబంధు పంపిణీకి అనుమతిచ్చిన ఎలక్షన్ కమిషన్ తాజాగా దీన్ని ఉపసంహరించుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలతో రైతుబంధు పంపిణీ పర్మిషన్ను వెనక్కి తీసుకుంది.
Translate this News: