యుద్ధంలో 43 వేల మంది సైనికులను కోల్పోయాం, శాంతి కావాలి: జెలెన్స్కీ
దాదాపు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో తాము 43 వేల మంది సైనికులను కోల్పోయామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తాజాగా డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన ఆయన.. రష్యా మరోసారి దాడి చేసే అవకాశం లేనివిధంగా శాంతి ఒప్పందం అవసరమని కోరారు.
ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా.. పవర్ గ్రిడ్లే లక్ష్యంగా దాడులు
ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై రష్యా మరోసారి దాడులు చేసింది. అక్కడి పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకొని క్షిపణులు ప్రయోగించింది. తమ దేశంలో విద్యుత్ సరఫరా, ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ తెలిపారు.
రష్యాలో ఉద్రిక్తత.. మాస్కోపై 34 డ్రోన్లతో విరుచుకుపడ్డ ఉక్రెయిన్..
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదిరింది. రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ దాడులకు పాల్పడింది. మొత్తం 34 డ్రోన్లతో విరుచుకుపడింది. యుద్ధం మొదలైన తర్వాత రష్యాపై ఈ స్థాయిలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి చేయడం ఇదే మొదటిసారి.
PM Modi : అమెరికా అధ్యక్షునితో మోదీ భేటీ!
రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మోదీని కోరారు. మోదీ-బైడెన్ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాల గురించి చర్చించారు.
Russia vs Ukraine: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. పెను విధ్వంసం
ఉక్రెయిన్ మంగళవారం రష్యాపై భీకరమైన డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్ 144 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కోతో సహా 8 ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా రాజధాని మాస్కో సమీపంలో దాదాపు 20 డ్రోన్లను కూల్చివేశారు.
Modi-Zelensky: ప్రధాని మోదీ, జెలెన్స్కీ ఆత్మీయ ఆలింగనం.. వీడియో వైరల్
ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత రష్యా దాడిలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారులకు మోదీ నివాళులర్పించారు. అలాగే ఇరుదేశాధినేతలు వ్యక్తిగతంగా, బృందస్థాయిలో భేటీ కానున్నారు
Russia-Ukraine War: రష్యా - ఉక్రెయిన్ సరిహద్దుల్లో హై అలెర్ట్..
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఇప్పటికే కర్స్క్ ప్రాంతంలో కొంత భాగాన్ని ఆక్రమించిన ఉక్రెయిన్ సేనలు మరింత ముందుకు సాగుతున్నాయి. దీంతో బెల్గొరాడ్‌లో రష్యా ఎమర్జెన్సీ విధించింది. అలాగే రష్యన్ అధికారులు పలు ప్రాంతాల్లో నివసించే ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Russia : విరుచుకుపడ్డ ఉక్రెయిన్..రష్యాలోని పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ!
రష్యాలో మోదీ జరుగనున్న నేపథ్యంలో... ఆ దేశం పై ఉక్రెయిన్ నిప్పుల వర్షం కురిపిస్తుంది. అందుకు గానూ అమెరికా, ఐరోపా దేశాల నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంది. దీంతో రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో అక్కడి అధికారులు ఎమర్జెన్సీని ప్రకటించారు.