PM Modi : అమెరికా అధ్యక్షునితో మోదీ భేటీ!

రెండేళ్లుగా కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ మోదీని కోరారు. మోదీ-బైడెన్‌ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాల గురించి చర్చించారు.

author-image
By Bhavana
New Update
president

Modi-Biden : రెండేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, దీనికి భారత్‌ చొరవ చూపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ భారత్‌ ని కోరారు. మోదీ-బైడెన్‌ మధ్య శనివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా.. ఇరువురు నేతలు పలు అంశాలపై మాట్లాడారు. బైడెన్‌ తన స్వస్థలం విల్మింగ్టన్‌(వాషింగ్టన్‌కు 170 కిలోమీటర్ల దూరం)లో క్వాడ్‌ నాయకుల భేటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అమెరికా కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఫిలడెల్ఫియా చేరుకున్న భారత ప్రధాని మోదీకి.. భారతీయ-అమెరికన్ల నుంచి ఘన స్వాగతం లభించింది. అక్కడి నుంచి ఆయన నేరుగా విల్మింగ్టన్‌కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఆయనను ఆప్యాయంగా కౌగిలించుకుని, ఆహ్వానించారు. విల్మింగ్టన్‌లో క్వాడ్‌ నేతల సమావేశానికి ముందు.. మోదీ-బైడెన్‌ భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని గురించి బైడెన్‌ మోదీతో ప్రస్తావించారు. యుద్ధాన్ని నిలువరించే అంశంపై భారత్‌ చొరవ తీసుకోవాలని ఆయన మోదీని కోరారు. ప్రధాని మోదీ కూడా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో తన ఇటీవలి భేటీ గురించి బైడెన్‌కు తెలిపారు. ఇండో-పసిఫిక్‌ రీజియన్‌లో చైనా చర్యల పైనా ఇరువురు నేతలు చర్చించారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ తెలిపారు. ఇరువురు నేతలు భద్రత, సాంకేతికత, ఆర్థిక అంశాలపై చర్చించినట్లు తెలిపారు. 

భారత్‌ కొనుగోలు చేయనున్న 31 ప్రిడేటర్‌ డ్రోన్లపైనా ఒప్పందాలు కుదిరినట్లు సమాచారం. అంతరిక్ష రంగంలో సహకారం.. ఇతర అంశాలపైనా ఇరువురు నేతలు కొద్ది సేపు చర్చించారు. మోదీ కూడా తమ ద్వైపాక్షిక చర్చలు భారత పౌరులు, ప్రపంచ మేలు కోసం ఉద్దేశించినవని ఆయన ఎక్స్‌ ఖాతాలో పేర్కొన్నారు. సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిగినట్లు తెలిపారు. 

కాగా.. ఆదివారం ఉదయం మోదీ న్యూయార్క్‌ చేరుకుంటారు. అక్కడ లాంగ్‌ ఐలాండ్‌లో ‘మోదీ అండ్‌ యూఎస్‌’ పేరుతో భారతీయ అమెరికన్లు నాసా వెటరన్స్‌ మెమోరియల్‌ కొలీజియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి 14 వేల మంది హాజరవుతారని అంచనా. మోదీ తన అమెరికా పర్యటనలో భాగంగా సోమవారం ఐరాస సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. పలు అమెరికా సంస్థలు, కంపెనీలకు సీఈవోలుగా ఉన్న భారత సంతతి అమెరికన్లతో ఆయన సమావేశమై.. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సెమీ కండక్టర్ల రంగంపై చర్చించే అవకాశాలున్నాయి.

Also Read :  పాఠశాలలే లక్ష్యంగా దాడులు..22 మంది మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు