Russia vs Ukraine: రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు.. పెను విధ్వంసం

ఉక్రెయిన్ మంగళవారం రష్యాపై భీకరమైన డ్రోన్ దాడి చేసింది. ఉక్రెయిన్ 144 డ్రోన్లతో రష్యా రాజధాని మాస్కోతో సహా 8 ప్రావిన్సులను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడిలో పలు నివాస భవనాలు దెబ్బతిన్నాయి. రష్యా రాజధాని మాస్కో సమీపంలో దాదాపు 20 డ్రోన్‌లను కూల్చివేశారు.

author-image
By KVD Varma
New Update
Russia vs Ukraine

Russia vs Ukraine : ఉక్రెయిన్ రష్యాపై మరోసారి డ్రోన్ లతో విరుచుకు పడింది. మంగళవారం జరిగిన ఈ దాడిలో పదుల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ దాడి కారణంగా, మాస్కో - చుట్టుపక్కల విమానాశ్రయాల నుండి 50కి పైగా విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. రష్యా అధికారుల ప్రకారం, 4 మాస్కో విమానాశ్రయాలను 3 నుంచి 6 గంటలకు పైగా మూసివేయవలసి వచ్చింది.

Russia vs Ukraine: ఈ దాడిలో 46 ఏళ్ల మహిళ కూడా మరణించింది. రష్యా ఇతర 8 ప్రావిన్సుల్లో 124 డ్రోన్‌లను కూల్చివేసింది. ఈ దాడికి ప్రతీకారంగా రష్యా కూడా 46 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. అయితే, ఉక్రెయిన్ అందిస్తున్న వివరాల ప్రకారం, రష్యాకు చెందిన 38 డ్రోన్‌లను ఉక్రెయిన్ కూల్చివేసింది.

10 రోజుల క్రితం 150కి పైగా డ్రోన్లతో దాడి.. 

Russia vs Ukraine: అంతకుముందు ఆగస్టు 31న ఉక్రెయిన్ 150కి పైగా డ్రోన్లతో రష్యాపై దాడి చేసింది. రెండున్నరేళ్ల పాటు రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధంలో తొలిసారిగా ఉక్రెయిన్ ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్లతో రష్యాపై దాడి చేసింది. అప్పుడు కూడా ఉక్రెయిన్ రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుంది.

మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ ప్రకారం, నగరంపై 11 డ్రోన్‌లు దాడి చేశాయి. ఈ దాడుల్లో చమురు శుద్ధి కర్మాగారం - సాంకేతిక గదిని లక్ష్యంగా చేసుకున్నారు. చమురు శుద్ధి కర్మాగారంపై దాడి తర్వాత, అది పేలింది. అనంతరం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. రష్యా అధికారుల ప్రకారం, ఉక్రెయిన్ 158 డ్రోన్లతో 15 ప్రావిన్సులపై దాడి చేసింది. రష్యా వైమానిక రక్షణ దాదాపు అన్ని డ్రోన్‌లను అడ్డగించి కూల్చివేసిందని చెప్పారు.

దాడులను ఎదుర్కోవాలని పుతిన్ కోరారు

Russia vs Ukraine: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. దేశ భద్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకు బలగాలు సిద్ధంగా ఉండాలని పుతిన్ అన్నారు. ఓషన్-కమాండ్ 2024 ఎక్సర్సైజ్ లో  పాల్గొన్న సైనికులను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు.

ఓషన్-2024లో 400కు పైగా రష్యా యుద్ధనౌకలు, జలాంతర్గాములు, 120కి పైగా విమానాలు, హెలికాప్టర్లు పాల్గొంటున్నాయి. ఇది కాకుండా 90 వేల మందికి పైగా సైనికులు ఇందులో భాగంగా ఉన్నారు. 

రష్యా పై పెద్ద దాడికి ఉక్రెయిన్ ప్రయత్నం.. 

Russia vs Ukraine: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాపై పెద్ద దాడి చేయాలని కోరుకుంటున్నారు.  వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, వారు సహాయం కోసం అమెరికాపై కూడా ఒత్తిడి తెస్తున్నారు. ఆగస్టు 31న జెలెన్స్కీ ఒక వీడియోను విడుదల చేసి, ఆగస్టు 30న రష్యా ఖార్కివ్‌పై వైమానిక దాడి చేసిందని, ఇందులో 6 మంది ఉక్రేనియన్లు మరణించారని చెప్పారు. అలాగే, 97 మంది గాయపడ్డారని వివరించారు. 

Russia vs Ukraine: ఉక్రెయిన్ రష్యా ఎయిర్‌ఫీల్డ్‌లు,సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటే మాత్రమే ఈ దాడులను ఆపగలమని జెలెన్స్కీ చెప్పారు. మేము ప్రతిరోజూ మా భాగస్వామ్య దేశాలతో దీని గురించి చర్చిస్తున్నాము. ఇందుకోసం వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నాము అంటూ ఆయన పేర్కొన్నారు.

Also Read :   పోలీసులతో హైడ్రా మరింత బలోపేతం

Advertisment
తాజా కథనాలు