MLC Kavitha: ఇవాళ ఢిల్లీ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్ షీట్పైఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టుకు కవిత, మనీష్ సిసోడియాతో పాటు ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరుకానున్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ చార్జ్ షీట్పైఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరగనుంది. ట్రయల్ కోర్టుకు కవిత, మనీష్ సిసోడియాతో పాటు ఇతర లిక్కర్ కేసు నిందితులు హాజరుకానున్నారు.
లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్లో పేజీలు సరిగ్గా లేవని నిందితుల న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది కోర్టు.
TG: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఛార్జిషీట్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎమ్మెల్సీ కవితను ఏ17గా చేర్చుతూ ఛార్జిషీట్లో సీబీఐ పేర్కొంది. కాగా కవితను విచారణకు వర్చువల్‌గా హరాజరుపర్చనున్నారు అధికారులు.
లిక్కర్ స్కాం కేసులో కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరారు. వాస్తవానికి రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగాల్సి ఉండగా.. కవిత పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకోవడం చర్చనీయాంశమైంది
లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్యే కవితకు కోర్టు షాక్ ఇచ్చింది. వారి జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్, కవిత కస్టడీని ఈనెల 31 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
కస్టడీలో తనకు బెల్ట్ అనుమతించాలని సీఎం కేజ్రీవాల్ కోరారు. తన బెల్ట్ అధికారులు తీసుకోవడంతో తిహార్ జైలుకు వెళ్లేటప్పుడు ప్యాంటు చేతితో పట్టుకోవాల్సి వచ్చిందని, అది ఇబ్బందిగా ఉందని వివరించారు. బెల్టుతో పాటు కళ్లద్దాలు, మెడిసిన్, ఇంటి భోజనం, భగవద్గీతనూ కోర్టు అనుమతించింది.
సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ మీద ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును మే 2కు రిజర్వ్ చేసింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మళ్ళీ జుడిషియల్ కస్టడీ విధించింది. ఈ నెల 23 వరకు ఆమెను కస్టడీలోనే ఉంచాలని ఆదేశించింది. నిన్నటితో మూడు రోజుల కస్టడీ ముగియడంతో ఈరోజు ఆమెను కోర్టులో హాజరుపర్చింది సీబీఐ.