Crime News : కొత్త ఏడాది కోలుకోలేని విషాదాలు..ఇప్పటికే ఎంత మంది చనిపోయారంటే? న్యూ ఇయర్ కొందరి జీవితాల్లో విషాదం నింపింది. ఊహించని సంఘటనలతో పలువురు ప్రాణాలు కొల్పోగా కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రల్లో ఇప్పటికే 20 మందికి పైగా రోడ్డు, తదితర ప్రమాదాల్లో చనిపోయారు. మరికొందరు దారుణంగా గాయపడ్డారు. By Jyoshna Sappogula 01 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి Crime News 2024 : ఈ నూతన సంవత్సరం(New Year) తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ ప్రజలంతా ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అయితే ఇదే న్యూ ఇయర్ కొందరి జీవితాల్లో విషాదం నింపింది. ఊహించని సంఘటనలతో పలువురు ప్రాణాలు కొల్పోగా కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. తెలుగు రాష్ట్రల్లోనే దాదాపు ఈ ఒక్కరోజులేనే 20 మందికి పైగా రోడ్డు, తదితర ప్రమాదాల్లో(Road Accidents) చనిపోగా మరికొందరు దారుణంగా గాయపడ్డారు. ఒకసారి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరిశీలిస్తే పలు ఘటనలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ ఘాన్సిమియాగూడలో డిసెంబర్ 31 రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పహడీషరీఫ్ ప్రాంతానికి చెందిన మల్లేశ్ అనే యువకుడిని కత్తితో పొడిచి రాళ్లతో బాది హత్య చేసి దుండగులు పారిపోయారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులకోసం గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోనూ ఓ కారు వేగంగా వెళ్లి లారీని ఢీట్టింది. ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. సూర్యాపేట హైటెక్ బస్టాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌కు చెందిన నటరాజ్‌గా గుర్తించారు. Also Read: కల్యాణలక్ష్మి కింద తులం బంగారం.. గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మహబూబ్‌నగర్ బాలుర గురుకుల కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. తరగతి గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడు సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం భూనేడు వాసి రామిరెడ్డిగా గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో సైతం విషాదం నెలకొంది.కాంగ్రెస్ నేత రాములు మృతి చెందారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి జిల్లాలో గుర్తు తెలియని వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. పటాన్‌చెరు శివారు నోవపాన్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనం కనిపించకపోవడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. 11 మంది యువకులు జేఎన్టీయూ నుంచి స్నేహితుని వద్దకు వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ కూకట్‌పల్లిలో బైక్‌ను కారు ఢీ కొట్టగా ఒకరు మృతి చెందారు. హౌసింగ్ బోర్డు కాలనీలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మోతీనగర్‌కు చెందిన అరుణ్‌గా గుర్తించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వేస్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రైలు కింద పడి యువతీ యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం చింతగున్నాలులో తండ్రిపైనే ఓ కొడుకు దారుణానికి పాల్పడ్డాడు. పార్టీ చేసుకునేందుకు అడిగిన డబ్బులు ఇవ్వలేదని కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నంద్యాల జిల్లా డోన్ మండలం ఉంగరానిగుండ్లలోనూ పాత కక్షలతో నేపథ్యంలో కర్రలతో దాడి చేసుకున్నారు ఇరువర్గాలు. ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలు అయ్యాయి. రెండు కార్ల అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో డోన్ గ్రామీణ పోలీసు స్టేషన్ వద్ద మృతుడి బంధువులు ఆందోళన చేపట్టారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లిలోనూ విషాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం బావిలో పడి ఇద్దరు మృతి చెందారు. ప్రకాశం జిల్లాలోనూ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. బేస్తవారపేట మండలం శెట్టిచెర్ల అడ్డరోడ్డు వద్ద తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ ప్రార్థనలతో సందడిగా ఉండాల్సిన చర్చి ప్రాంగణంలోనూ విషాదం నెలకొంది. చర్చి కమిటీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణను నిలువరించే ప్రయత్నంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. #crime-news #new-year-2024 #road-accidents మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి