Latest News In Telugu KTR vs Revanth: 'డ్రామారావు.. గజకర్ణ, గోకర్ణ, టక్కు టమార'.. మొండి కత్తి డ్రామా! బీఆర్ఎస్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తి దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దాడి చేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అని.. ఓ నేరస్థుడిని టీపీసీసీ అధ్యక్షుడిగా చేశారంటూ కేటీఆర్ వేసిన ట్వీట్‌పై రేవంత్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. ఒక ఎంపీపై దాడి జరిగితే దానిని చిల్లర రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే మీ కచరా ప్రయత్నం చూస్తుంటే బీఆర్ఎస్ ఓటమి ఖాయం ఐనట్టేనంటూ మండిపడ్డారు. By Trinath 30 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS Congress: ఇదేం అనువాదం అయ్యా.. డీకే మీటింగ్ పై కాంగ్రెస్ శ్రేణుల గుస్సా.. ఎందుకంటే? అనువాదం(ట్రాన్స్లేషన్) కాంగ్రెస్‌ను చిక్కుల్లో పడేసింది. తాండూరు సభలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడింది ఒకటైతే కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి అనువదించింది మరొకటి. కర్ణాటకలో 5 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామని.. తెలంగాణలో మాత్రం హామీ ఇచ్చిన విధంగా ఉచిత కరెంట్ ఇస్తామని శివకుమార్ చెప్పారు. దీన్ని సగమే అనువదించి వదిలేశారు రామ్మోహన్. అటు రేవంత్‌రెడ్డి సీఎం అవుతారంటూ అసలు డీకే శివకుమార్ చెప్పనిదాన్ని చెప్పి కాంగ్రెస్‌లో కొత్త చిచ్చు లేపారు. By Trinath 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు TS Politics: బీజేపీకి మరో బిగ్ షాక్.. ఫామ్‌హౌస్‌లో వివేక్, రేవంత్ రెడ్డి చర్చలు? తెలంగాణ బీజేపీకి మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. ఆ పార్టీ కీలక నేత వివేక్ తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. వివేక్ ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి చెన్నూరు నుంచి పోటీ చేయాలని కోరినట్లు సమాచారం. By Nikhil 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TPCC press meet:ఆ అధికారులను వెంటనే తొలగించండి: రేవంత్ రెడ్డి సంచలన డిమాండ్ సంక్షేమ పథకాల నగదు బదిలీ ప్రక్రియను పూర్తి చేయాలని నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని చెప్పారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. నవంబర్ 2లోగా అన్ని పూర్తి చేయాలని చెప్పామన్నారు. రిటైర్ అధికారులతో నయా రాజాకార్ ఆర్మీని కేసీఆర్ నియమించుకున్నారు.కొందరు అధికారులు బీఆరెస్ ఎన్నికల నిర్వహణ టీమ్ లా పనిచేస్తున్నారనివారిని వెంటనే తొలగించాలని ఈసీని కోరామని చెప్పారు. ఢిల్లీలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేతల ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్క పాల్గొన్నారు. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BRS Fire : ఆ సమయంలో రైతుబంధు విడుదల ఆపాలని ఈసీకి కాంగ్రెస్ లేఖ.. భగ్గుమన్న బీఆర్ఎస్..!! ఎన్నికల సమయంలో రైతు బంధు నిధుల విడుదల ఆపాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాయడాన్ని..బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుబట్టింది. తెలంగాణ రైతులకు ద్రోహం చేసేలా కాంగ్రెస్ మరో కుట్రకు తెరలేపిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ అడ్డుకునే కుట్ర చేస్తుందంటూ ఫైర్ అయ్యింది. కాంగ్రెస్ రైతు విద్రోహ చర్యలపై అన్నదాతలు సైతం మండిపడుతున్నారని బీఆర్ఎస్ అంటోంది. రైతుబంధుపై కాంగ్రెస్ అక్కసును తీవ్రంగా ఖండించింది. రైతులంగా కేసీఆర్ వెంట ఉన్నారన్న కారణంతోనే కాంగ్రెస్ ఇలాంటి కుట్రలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏఐసీసీకి కాంగ్రెస్ రాసిన లేఖపై మండిపడుతూ బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ప్రకటన విడుదల చేశారు. By Bhoomi 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: కేసీఆర్ తలుచుకుంటే రేవంత్‌ను ఎప్పుడో జైల్లో వేసేవారు: హరీష్ రావు ముఖ్యంత్రి కేసీఆర్ తలచుకుంటే రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఎప్పుడో జైల్లో పెట్టేవారని మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. విపక్షాలు ఎన్ని ట్రిక్కులు చేసినా కూడా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రాణాలు పణంగా పెట్టిన వ్యక్తి కావాలో లేక ఉద్యమ కారుల భుజాలపై తుపాకీ గురిపెట్టిన వ్యక్తులు కావాలో ప్రజలే ఆలోచించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో.. ధరణిని బంగాళఖాతంలో కలపాలన్న వారినే ప్రజలు అదే బంగాళాఖాతంలో ముంచుతారని పేర్కొన్నారు. By B Aravind 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రేవంత్ తీరుతో కాంగ్రెస్‌కు నష్టం..సోనియా, రాహుల్‌కు గోనె ప్రకాష్ సంచలన లేఖలు..!! కాంగ్రెస్ పార్టీలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్యే గోనే ప్రకాష్ రావు. టీపీసీసీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి సర్వేల పేరుతో పార్టీని తప్పుదారి పట్టిస్తున్నాడని...ఫేక్ సర్వేలను నిర్వహించి బీసీలకు టికెట్లు తగ్గేలా అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత ఎన్నికల్లో బీసీలకు, వెనకబడిన వర్గాలకు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరారు. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Revanth Reddy: రేవంత్ రెడ్డికి షాక్.. ఈడీకి ఫిర్యాదు చేసిన సొంత పార్టీ నేత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీద సొంత పార్టీ నేత కురువ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఆయన పేర్కొన్నారు.రేవంత్ పై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి తెలియజేశారు. By Bhavana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: సింగరేణి విషయంలో అది నిజం కాదా? సీఎం కేసీఆర్‌పై రేవంత్ సంచలన కామెంట్స్.. సింగరేని సంస్థ బాగుపడాలంటే మంచి యాజమాన్యం, మంచి ప్రభుత్వం ఉండాలన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. సింగరేణి ఎన్నికలు జరగాలంటే డిసెంబర్ 3న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. సింగరేణి సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. గురువారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ గనిలో గేట్ మీటింగ్‌లో పాల్గొన్న టీపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn