మొగులయ్యకు అన్యాయం.. ప్రభుత్వం ఇచ్చిన 15 రోజులకే ధ్వంసం!

పద్మశ్రీ అవార్డు గ్రహీత కిన్నెర మొగులయ్యకు చేదు అనుభవం ఎదురైంది. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన 600 గజాల స్థలంలో ఇటీవల కాంపౌండ్ వాల్‌ను నిర్మించుకున్నాడు. ఆ వాల్‌ను గుర్తు తెలియని దుండగులు రాత్రి ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

New Update
Darshanam Mogilaiah

కిన్నెర మొగులయ్య. ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. తన జానపద పాటలతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన ‘బీమ్లా నాయక్’ సినిమాలో ‘పుట్టిండయ్యా పులి పిల్ల’ అనే టైటిల్ సాంగ్‌ను పాడి బాగా గుర్తింపు సంపాదించుకున్నారు. అలా తన గాత్రంతో ఎంతోమందిని అలరించిన జానపద సంగీత కళాకారుడు మొగులయ్యకు 2022లో పద్మశ్రీ అవార్డు లభించింది.

రాత్రికి రాత్రే ధ్వంసం

తెలంగాణలో ప్రత్యేకమైన జానపద సంగీత వాయిద్యమైన కిన్నెర సాంప్రదాయ కళారూపాన్ని పరిరక్షించడంలో చేసిన కృషికి గానూ కేంద్రం పద్మ శ్రీ అవార్డుతో మొగులయ్యను సత్కరించింది. అలా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మొగులయ్యకు తాజాగా ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

ఇది కూడా చదవండి: ప్రాణాలకు తెగించిన యువకుడు.. తండ్రి, కూతురిని ఎలా కాపాడాడంటే?

ప్రభుత్వం ఇచ్చిన 15 రోజులకే తన ఇంటి కాంపౌండ్ వాల్‌ను రాత్రికి రాత్రే కూల్చివేశారు. దీంతో కిన్నెర మొగులయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నాడు. ఇంతకీ ఆయన కాంపౌండ్ వాల్ ఎవరు కూలగొట్టారు? అనే విషయానికొస్తే..

ఇది కూడా చదవండి: ఆఫర్ అరాచకం.. ఐఫోన్ 15 ప్రోపై కళ్లుచెదిరే డిస్కౌంట్..!

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 24న హైదరాబాద్‌లోని హయత్ నగర్‌లో 600 గజాల ఇంటి స్థలాన్ని మొగులయ్యకు అందించింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్స్ సైతం రేవంత్ రెడ్డే అందించారు. దీంతో ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవాలని మొగులయ్య భావించాడు. ఆ స్థలం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకున్నాడు.

ప్రభుత్వం స్పందించాలి

అయితే ఏమైందో తెలియదు కానీ.. రాత్రికి రాత్రే ఆ కాంపౌండ్ వాల్‌ను గుర్తుతెలియని ధ్వంసం చేశారు. ఉదయాన్నే వెళ్లి చూసిన మొగులయ్య షాకైపోయాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనకు జరిగిన అన్యాయంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని మొగులయ్య వేడుకుంటున్నాడు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు