Caste Census: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. నేటి నుంచే!

తెలంగాణలో ఈరోజు నుంచి కులగణన కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలని రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉండనున్నాయి.

New Update
Caste Census : కులగణన తర్వాతే పంచాయతీ ఎన్నికలు.. సీఎం రేవంత్‌ సంచలన నిర్ణయం!

Caste Census: తెలంగాణ ప్రభుత్వం కులగణన అనే అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల సమయంలో తెలంగాణలో పర్యటించిన ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడుతామని అన్నారు. అలాగే కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా కులగణన చేపడుతామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు గడుస్తున్న సమయంలో కులగణనపై ఒక అడుగు ముందుకు వేసింది. 

Also Read :  'బాధ కూడా ఉంది..' ఆ విషయంలో తప్పు చేశా.. సమంత ఎమోషనల్

ఇంటింటి సర్వే షురూ...

కులగణన నేపథ్యంలో ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టనుంది రేవంత్ సర్కార్. ఈ నెల 8వరకు అంటే మూడు రోజుల పాటు ఇంటి సర్వే చేయనున్నారు. ఈ కులగణన చేసేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల సేవలను వాడుకోనున్నారు. మధ్యాహ్నం వరకు స్కూళ్లలో పాఠాలు బోధించి.. మధ్యాహ్నం నుంచి సర్వే చేయనున్నారు. కాగా సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులాల సమాచార సేకరణకు సమగ్ర ఇంటింటి కులగణన పూర్తి చేసేందుకు 30 రోజుల గడువు పెట్టింది. ఇందుకోసం 80 వేల మంది ఎన్యూమరేటర్ల నియమించింది. మండలాలవారీగా కంప్యూటరీకరణ చేయనున్నారు అధికారులు.

Also Read : 

గ్రామ పంచాయతీ/ మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల పేర్లు కోడ్ రూపంలో సేకరించనుంది సర్కార్. కాగా సర్వే చేసినట్లు ఇంటికి ఒక స్టిక్కర్ ను పెట్టనున్నారు అధికారులు. గతంలో జనాభా లెక్కల మాదిరి ఈ సర్వే ఉండనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే అధికారులు పూర్తీ చేశారు. ఈ కులగణన సర్వేలో ప్రజల సామాజిక, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ వివరాలను అధికారులు సేకరించనున్నారు. ఈ సర్వే కోసం 75 ప్రశ్నల ఫార్మాట్‌ను సిద్ధం చేసింది ప్రభుత్వం. ఈ ప్రశ్నలు రెండు భాగాలుగా ఉంటాయి.

సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలుండగా... ఇందులో 56 ప్రధాన ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు ఉండనున్నాయి. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉండనున్నాయి. ఇందులో కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల ఆధార్, పుట్టిన తేదీ, విద్యార్హత, పలు వ్యక్తిగత వివరాలను అడుగుతారు. అలాగే పార్ట్ -2లో కుటుంబ ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన పలు ప్రశ్నలు అడుగుతారు. ముందుగా.. ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. కాగా ఈ సర్వేలో భాగంగా ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 ఇళ్లను కేటాయించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు