Crime News: మాదాపూర్లో రేవ్ పార్టీ కలకలం.. 20 మంది అరెస్ట్..!
హైదరాబాద్ మాదాపూర్లో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. సైబర్ టవర్స్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ నిర్వహించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు 14 మంది యువకులు, ఆరుగురు యువతులను అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున డ్రగ్స్, రూ. లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.