మరో రేవ్‌ పార్టీలో డ్రగ్స్‌.. 15 మందికి పైగా అరెస్టు

కర్ణాటకలోని మైసూరు జిల్లాలో మీనాక్షిపుర సమీపంలో జరిగిన ఓ రేవ్ పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం మేరకు 15 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. అందులో వ్యాపారవేత్తలు, విద్యార్థులు, యువతులు కూడా ఉన్నారు.

New Update
Karnataka Rave party

ఈ మధ్య కాలంలో రేవ్‌ పార్టీలు చేసుకోవడం.. డ్రగ్స్‌ తీసుకొని పోలీసులు దొరికిపోవడం లాంటి ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరో రేవ్‌పార్టీలో కొందరు డ్రగ్స్‌ తీసుకుంటూ దొరికిపోవడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని మైసూరు జిల్లాలో మీనాక్షిపుర సమీపంలో జరిగిన ఓ రేవ్ పార్టీపై పోలీసులు సోదాలు చేశారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో 15 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారు. అందులో వ్యాపారవేత్తలు, విద్యార్థులు, యువతులు కూడా ఉన్నారు. మరో విషయం ఏంటంటే పోలీసులు సోదాలు చేసే సమయంలో 15 మంది మహిళలు అపస్మారక స్థితిలో పడి ఉండటం గమనార్హం. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే అందరినుంచి రక్త నమూనాలు సేకరించామని.. వీటికి టెస్టింగ్‌కు పంపుతామని పేర్కొన్నారు.  

Also Read :  స్కూల్ బస్సు కింద పడి నర్సరీ విద్యార్థి దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు