Weather Alert: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలు..
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మంగళవారం, బుధవారం రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
Godavari : భద్రాచలం వద్ద గోదావరి కొంచెం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ నుంచి వచ్చిన గోదావరి వరద తో భద్రాచలం మీదుగా పోలవరం మీదుగా ధవలేశ్వరం నుంచి సముద్రంలో కలుస్తుంది.
మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా ముంబయ్‌లో వానలు దంచికొడుతున్నాయి. దీంతో వాతావరణశాఖ ముంబయ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు ఇళ్ళల్లోనే ఉండాలని బయటకు రావొద్దని పోలీసులు కీలక సూచనలు చేశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. బంగాళాఖాతం అల్పపీడనం కారణంగా ఏపీలోనూ మరో మూడు రోజుల పాటు వానలు పడనున్నాయని తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మరోసారి పెరుగుతుంది. రెండు రోజుల క్రితం 51.6 అడుగులకు చేరుకున్న గోదావరి నీటిమట్టం మంగళవారం తగ్గుముఖం పట్టింది. రాత్రి 45 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతూ 47.3 అడుగుల వద్దకు చేరింది.
మహారాష్ట్ర, గుజరాత్, గోవా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వాన ముంబై నగరాన్ని ముంచెత్తుతోంది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థలు, ఉద్యోగులకు రెండు రోజులు సెలవును ప్రకటించింది.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. ప్రస్తుతం ఇన్ ఫ్లో లక్షా 80 వేల 686 క్యూసెక్కులు గా కొనసాగుతుంది. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 72 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారి తెలిపారు.
గుజరాత్లో మూడంతస్తు బిల్డింగ్ ఉన్నదాటున కూలిపోయింది గత కొద్ది రోజులుగా అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలూ నిండిపోయాయి. దీంతో చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి.